Rashmika: బేబీ ప్రమోషన్స్ లో రష్మిక.. మరిదిగారి కోసమేనా?

Rashmika Mandanna Launches Baby 3rd Single
x

Rashmika: బేబీ ప్రమోషన్స్ లో రష్మిక.. మరిదిగారి కోసమేనా?

Highlights

Rashmika Mandanna: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ప్రేమించుకుంటున్నారని గత కొంత కాలంగా రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ తమ్ముడు ఆనంద కొత్త సినిమా ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంది. ఈ ప్రమోషన్స్ లో రౌడీ ఫ్యాన్స్ వదినా అనగానే రష్మిక సిగ్గుల మొగ్గయింది.

టాలీవుడ్ హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎఫైర్ రూమర్స్ చాలా కామన్. వీటిలో కొన్ని నిజమైతే..మరికొన్ని పుకార్లుగానే మిగిలిపోతాయి. అయితే రష్మిక-విజయ్ దేవరకొండ మధ్య లవ్ గాసిప్స్ నిజమయ్యే సూచనలు ఎక్కువ ఉన్నాయని ఫిలిమ్ నగర్ లో టాక్ జోరుగా వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు కలిసి గీతాగోవిందం, డియర్ కామ్రెడ్ చిత్రాలు చేశారు. అప్పటి నుంచి మొదలైన వీరి ఫ్రెండ్ షిప్ ఆ తర్వాత ప్రేమగా మొగ్గ తొడిగిందని టాక్ ఉంది. అయితే తాము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని...తమ మధ్య అంతకుమించి ఏమీ లేదని ఇద్దరూ చెప్పినా..లవ్ రూమర్స్ కి బలం చేకూర్చే సంఘటలు పలు జరిగాయి. ఇద్దరు కలిసి ఫారిన్ ట్రిప్స్ కి వెళ్లడం, విజయదేవరకొండ ఇంట్లో నుంచి రష్మిక తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ చేయడంతో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు జోరందుకున్నాయి. ఈ జోరుకి తగ్గట్టే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన బేబీ రిలీజ్ ప్రమోషన్స్ లో రష్మిక పాల్గొంది. బేబీ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ ను రష్మిక విడుదల చేసింది.

సాధారణంగా తన సినిమా ప్రమోషన్స్ లో మినహా బయట సినిమా ఈవెంట్స్ లో కనిపించని రష్మిక బేబీ సినిమా ఈవెంట్ కి హాజరు కావడంతో చర్చకు దారి తీసింది. విజయ్ దేవరకొండతో ఉన్న సానిహిత్యంతోనే రష్మిక హాజరు అయిందని టాక్ ఊపందుకుంది. అంతేకాక, ఈ ఫంక్షన్ లో రౌడీ ఫ్యాన్స్ వదినా అంటూ రష్మికను పిలవడం అది విని మురిసిపోవడం జరిగింది. దీంతో విజయ్ తో లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు రష్మిక చెప్పకనే చెప్పిందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ జంట తమ రిలేషన్ గురించి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories