Ramayana: బాలీవుడ్ లో మరో రామాయణం సిద్ధం.. రావణుడి పాత్రలో యష్..

Ranbir Kapoor Alia Bhatt and Yash in Ramayana
x

Ramayana: బాలీవుడ్ లో మరో రామాయణం సిద్ధం.. రావణుడి పాత్రలో యష్..

Highlights

Ramayana: రణ్ బీర్ కపూర్ యానిమల్ మూవీతో దండెత్తబోతున్నాడు.

Ramayana: రణ్ బీర్ కపూర్ యానిమల్ మూవీతో దండెత్తబోతున్నాడు. ఆగస్ట్ 11న ఈ సినిమా రాబోతోంది. అంత వయోలెన్స్ తర్వాత సడన్ గా తను రాముడి అవతారం ఎత్తబోతున్నాడు. తన రావనుడిగా కేజీయఫ్ ఫేం యష్ రంగంలోకి దిగనున్నాడు. దంగల్ దర్శకుడి మేకింగ్ లో రణ్ బీర్ కపూర్, యష్ కలిసి రామాయణం చేయబోతున్నారట. డిసెంబర్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందట. ఇందులో రాముడిగా రణ్ బీర్, సీతగా ఆలియా, రావణుడిగా యష్ కన్పామ్ అంటున్నారు.

ఆల్ రెడీ ఆదిపురుష్ అంటూ ప్రభాస్, క్రుతి, సైఫ్ కాంబినేషన్ లో ఓం రౌత్ సినిమా తీశాడు. వచ్చేవారమే ఆ మూవీ రాబోతోంది. ఇంతలోనే మరో హిందీ రామాయణం సెట్స్ పైకెళ్లటం కన్ఫామ్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఆదిపురుష్ లో తెలుగు హీరో రాముడిగా కనించబోతుంటే, హిందీ హీరో రావణుడి పాత్ర వేశాడు. అదే రణ్ బీర్ కపూర్ మూవీలో హిందీ హీరో రాముడు, కన్నడ హీరో రావణుడిగా కనిపించబోతున్నాడు.

నిజానికి రణ్ బీర్ కపూర్ తన కెరీర్ ని రీడిజైన్ చేసుకుంటున్నాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా, మాస్ ఇమేజ్ కాని, మార్కెట్లో మైలేజ్ కాని పెరగట్లేదు. అందుకే ఆ మధ్య బ్రహ్మస్త్ర, తర్వాత యానిమాల్ అంటూ రూట్ మార్చాడు. జోనర్స్ మారుస్తూనే ఇప్పుడు రాముడిగా విల్లు ఎక్కి పడతా నంటున్నాడు. ఇక ఇద్దరు బడా స్టార్లు కలిసి పాన్ ఇండియా రేంజ్ మూవీలు చేయటం కొత్త కాదు. అప్పట్లో బాహుబలి, తర్వాత త్రిబుల్ ఆర్ తో అది సాధ్యమైంది. అచ్చంగా ఎన్టీఆర్, చరణ్ చేసినట్టే రణ్ బీర్, యష్ కూడా భారీ ప్రయోగానికి సిద్దమయ్యారు. ఆల్రెడీ ఎన్టీఆర్ వార్ 2 లో నటించటం కన్ఫామ్ అయ్యింది. అలా హ్రతిక్, తారక్ కాంబినేషన్ సెన్సేషన్ అయ్యేలా ఉందంటే, ఇంతలో రణ్ బీర్, యష్ కాంబినేషన్ మీద ప్రచారం పెరిగింది. ఇది మరింత సెన్సేషన్ అయ్యేలా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories