Rana Guest Roll in Prabas Movie: టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని అమాంతం పెంచేసిన సినిమా బాహుబలి.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
Rana Guest Roll in Prabas Movie: టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని అమాంతం పెంచేసిన సినిమా బాహుబలి.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రానా, ప్రభాస్ ముఖ్య పాత్రలు పోషించారు..భళ్ళాలదేవుడిగా రానా అలరిస్తే, బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రలలో ప్రభాస్ నటవిశ్వరూపం చూపించాడు... ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రభాస్, రానా కలిసి ఎప్పుడు నటిస్తారని టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ఓ సినిమాలో రానా గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.. ఈ సినిమాలో ఓ రెండు నిమిషాలు కనిపించే పాత్రలో రానా మెరవనున్నడని సమాచారం అయితే దీని పైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.. ఈ సినిమాని యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని నవంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమాకి రాధేశ్యామ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది..
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్
దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కబోయే సినిమాని చేయనున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.. దీనికి సంబంధించిన నటీనటులను త్వరలో ఎంపిక చేయనున్నారు..
ఇక ఇటు రానా విషయానికి వస్తే ప్రస్తుతం రానా నటించిన ఆరణ్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. కరోనా వలన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాతో పాటుగా రానా విరాటపర్వం అనే ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు రానా..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire