రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా
x
Highlights

సినిమా కి తగ్గట్టుగా తన ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రతి సినిమాతో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోల లో రానా దగ్గుబాటి కూడా ఒకరు. కేవలం...

సినిమా కి తగ్గట్టుగా తన ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రతి సినిమాతో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోల లో రానా దగ్గుబాటి కూడా ఒకరు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకునే రానా దగ్గుబాటి తన పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని సైతం మార్చుకొని పాత్రలో ఒదిగిపోతూ ఉంటాడు. 'బాహుబలి' సినిమాలో భల్లాలదేవుడి పాత్ర కోసం బాగా కండలు పెంచిన రానా మళ్లీ ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం విపరీతంగా బరువు తగ్గడం ఇప్పటికే మనం చూశాం.

ఇక ఈ మధ్య మళ్ళీ 'హాథి మేరే సాథి' సినిమా కోసం కొంచెం బరువు పెరిగిన రానా ఇప్పుడు మళ్ళీ తన తదుపరి సినిమా కోసం సరికొత్త లుక్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఆఖరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం 1992' సినిమాలో నటించనున్నాడు రానా. తాజాగా మళ్లీ రానా చాలా సన్నగా మారిపోయాడు. అయితే గత కొంత కాలంగా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రానా వాటివల్లనే బరువు తగ్గడా లేక తన తదుపరి సినిమా కోసం బరువు తగ్గడా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.



Show Full Article
Print Article
Next Story
More Stories