Rana Daggubati: నటుడిగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్న రానా

Rana Daggubati Completes 11 Years as an Actor
x

రానా దగ్గుబాటి (ఫొటో ట్విట్టర్)

Highlights

Rana Daggubati: హీరో రానా దగ్గుబాటి నటుడిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

Rana Daggubati: హీరో రానా దగ్గుబాటి నటుడిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన తాజా చిత్రం "అరణ్య" గత వారం థియేటర్లను చేరింది. ఈ బహుభాషా చిత్రం తమిళంలో "కదన్" అనేపేరుతో విడుదలైంది. "హాతి మేరే సాతి" అనే పేరుతో హిందీలో మాత్రం విడుదల కాలేదు. కారణం ముంబైలో కోవిడ్ కేసుల పెరుగుతుండడంతో... ప్రస్తుతానికి ఈ సినిమా వాయిదా పడింది.

"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు" గెలుచుకున్న నిర్మాత డి. రామానాయుడు మనవడిగా, అలాగే తెలుగు సూపర్ స్టార్ వెంకటేష్ మేనల్లుడిగా రానా తన సినీ జీవితాన్ని 2010లో మొదలుపెట్టాడు. మొదటి సినిమా "లీడర్" తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను గ్రేట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇక, రోహన్ సిప్పీ మల్టీస్టారర్ "దమ్ మారి దమ్"తో ఏడాది తరువాత బాలీవుడ్‌లోకి అడుగులు వేశాడు. ఎక్కువగా టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నా... ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ పై కన్ను వేశాడు. తమిళ, హిందీ లోనూ తన మార్కెట్ ను స్థిరపరుచుకునే ప్లాన్ లో ఉన్నాడు.

"నేను రెగ్యులర్ లవ్ స్టోరీల సినిమాలు చేసే వాడిని కాదు. ఎందుకంటే నేను కాలేజీకి వెళ్లలేదు. అవి నాకు కనెక్ట్ కావు. అలా అని ప్రతీకారం, యాక్షన్ లాంటి కమర్షియల్ సినిమాలకు పెద్ద ఫ్యాన్‌ని కూడా కాదు." అని రానా ఓ ఇంటర్య్వూ లో అన్నారు. అలానే ప్రతీ సినిమాలో విలక్షణ పాత్రలతో రాణిస్తున్నాడు రానా.

కాగా, దర్శక ధీరుడు రాజమౌళి తీసిన "బాహుబలి" సినిమాలో భల్లలదేవ పాత్రతో పాన్-ఇండియా యాక్టర్ గా గుర్తింపు సాధించాడు. "నాకు భాష ముఖ్యం కాదు. ఏ క్యారెక్టర్ చేస్తున్నామన్నదే చూస్తానని, అలా అనుకుంటే కంపర్ట్ జోన్ లో ఉండిపోయేవాడినని, విలక్షణ పాత్రలు చేసే అవకాశం వచ్చేది కాదని" రానా అన్నారు.

బాలీవుడ్లో గత దశాబ్దంలో, "దమ్ మారో దమ్", "బేబీ", "డిపార్ట్మెంట్", "యే జవానీ హై దీవానీ", "హౌస్ఫుల్ 4", "వెల్‌కమ్ టు న్యూయార్క్ " "ది ఘాజి ఎటాక్" లాంటి సినిమాలు చేసి అలరించాడు. ఈ సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు.

"ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా సౌత్ ఇండస్ట్రీల నుంచి భిన్నమైన కథలు వస్తున్నాయి. కొత్త కథలకు ఇదేమంచి సమయమని" రానా వెల్లడించాడు.

ఇక తెలుగులో ఇప్పటి వరకు 15 సినమాలు పూర్తి చేశాడు. మరో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే తమిళంలో 7 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఇటు నటనతోనే కాదు... అటు హోస్ట్, కో ప్రొడ్యూసర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్, ప్రసెంటర్ గా భిన్నమైన విభాలలో రాణిస్తున్నాడు రానా.

Show Full Article
Print Article
Next Story
More Stories