The Warriorr Movie: రామ్ పోతినేని ది వారియర్ మూవీ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..!

Ram Pothinenis The Warriorr Movie Review | Tollywood
x

The Warriorr Movie: రామ్ పోతినేని ది వారియర్ మూవీ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..!

Highlights

The Warriorr Movie: రామ్ పోతినేని ది వారియర్ మూవీ రివ్యూ.. ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే..!

The Warriorr Movie Review:

చిత్రం: ది వారియర్

నటీనటులు: రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా, తదితరులు

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సుజ్జిత్ వాసుదేవ్

నిర్మాత: శ్రీనివాస చిట్టూరి

దర్శకత్వం: ఎన్ లింగుస్వామి

బ్యానర్లు: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్

విడుదల తేది: 14/07/2022

ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో రామ్ "రెడ్" సినిమాతో పర్వాలేదు అనిపించాడు. తాజాగా ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ ఎన్ లింగు స్వామి దర్శకత్వంలో "ది వారియర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ పాత్రలో కనిపించారు. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అక్షర గౌడ మరియు నదియ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఇవాళ అనగా జులై 14 న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

కథ:

సత్య (రామ్) డ్యూటీకి ప్రాణం ఇచ్చే ఒక మంచి డాక్టర్. అతనికి కర్నూల్ లోని ఒక నగరంలో పోస్టింగ్ వస్తుంది. కానీ ఆ ప్రాంతం మొత్తం పెద్ద గ్యాంగ్స్టర్ అయిన గురు (ఆది పినిశెట్టి) కంట్రోల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్య గురు కి వ్యతిరేకంగా వెళ్లి ఓడిపోతాడు. కానీ ఎలాగైనా గురుని ఓడించాలనే పట్టుదలతో పోలీస్ ఆఫీసర్ గా మారతాడు. ఒక డాక్టర్ పోలీస్ గా ఎలా మారాడు? గురుని సత్య ఓడించగలిగాడా? చివరికి ఏమైంది? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

రామ్ నటన ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. డాక్టర్ గానే మెప్పించిన రామ్ పోలీస్ గా కూడా తన పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. అది పెనిశెట్టి పాత్ర ఈ సినిమాకి పెద్ద హై లైట్ అని చెప్పవచ్చు. విలన్ పాత్ర అయినప్పటికీ ఆది పినిశెట్టి ఆ పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీతో కూడా చాలా బాగా మెప్పించారు. కృతి శెట్టి తన అందం మరియు అభినయంతో అలరించింది. అక్షర గౌడ కూడా తన అద్భుతమైన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఇక నదియా నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పాత్ర, మరియు నటన సినిమాకి బాగానే ప్లస్ అయింది. బ్రహ్మాజీ మరియు జయప్రకాష్ కూడా తమ పాత్రలలో బాగానే నటించారు. మిగతా నటి నటులు కూడా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

లింగుస్వామి కథను చాలా బాగా నేరెట్ చేసినప్పటికీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి నెరేషన్ బాగా స్లో అయినట్లు అనిపిస్తుంది. కథ బాగానే ఉన్నప్పటికీ నెరేషన్ తో పెద్దగా మెప్పించలేకపోయారు అని చెప్పుకోవచ్చు. చాలా వరకు సన్నివేశాలు కనెక్ట్ అయ్యే విధంగా ఉండకపోవడం సినిమాకి మైనస్ పాయింట్ గా మారింది. అప్పుడప్పుడు వచ్చే కొన్ని మంచి యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను బాగానే అలరిస్తాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం పరవాలేదు అనిపిస్తుంది. పాటల సంగతి పక్కన పెడితే నేపథ్య సంగీతం బాగుంది.

బలాలు:

నటీనటులు

రామ్ - ఆది పినిశెట్టి మధ్య సన్నివేశాలు

యాక్షన్ సన్నివేశాలు

బలహీనతలు:

స్లో నేరేషన్

సెకండ్ హాఫ్

కథ ప్రెడిక్టబుల్ గా అనిపించడం

చివరి మాట:

సినిమా ఆసక్తికరంగానే మొదలవుతుంది. రామ్ పాత్ర ఒక డాక్టర్ నుంచి పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారుతుంది అనే ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాగానే చూపించారు. మిగతా యాక్షన్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు తక్కువ అని చెప్పుకోవాలి. ఇక ఇంటర్వెల్ సినిమాపై మరింత ఆసక్తి ని పెంచుతుంది. కానీ సెకండ్ హాఫ్ కథ పరంగా బాగానే అనిపించినప్పటికీ నెరేషన్ పరంగా మాత్రం కొంచెం స్లో అయినట్లు చెప్పుకోవచ్చు. చాలావరకు సన్నివేశాలు కూడా లాజిక్ తో ఉండడం సినిమాకి అతిపెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. చివరిగా "ది వారియర్" సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ లాజిక్ మరియు యాక్షన్ సన్నివేశాలతో బాగానే అలరించింది.

బాటమ్ లైన్:

"ది వారియర్" లాజిక్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ కి ప్రాధాన్యత ఉన్న టిపికల్ కాప్ సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories