Megastar Chiranjeevi Birthday Common DP: మెగాస్టార్ కామన్ డీపీ లాంఛ్ చేసిన 'చిరు'త
Megastar Chiranjeevi Birthday Common DP: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా ఫ్యాన్స్ కు పండగే.. మరికొన్ని గంటల్లోనే చిరంజీవి తన 65వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ప్రతి ఏడాది తన అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకునే సంబురమిది.
Megastar Chiranjeevi Birthday Common DP: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా ఫ్యాన్స్ కు పండగే.. మరికొన్ని గంటల్లోనే చిరంజీవి తన 65వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నాడు. ప్రతి ఏడాది తన అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకునే సంబురమిది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా సోషల్ మీడియాకే పరిమితం చేశారు. ఆన్ లైన్ వేదికగానే చిరుబర్త్ డేను వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పట్నుంచే సంబరాలు మొదలు పెట్టారు.
ఈ క్రమంలో మెగాస్టార్ కామన్ డిపి ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంఛ్ చేసారు. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ అంటూ తండ్రికి మొదటి విషెస్ చెప్పాడు. ఇందులో చిరంజీవి ఐకానిక్ కారెక్టర్స్‌తో పాటు అదిరిపోయే ఫోటోలు కూడా ఉన్నాయి. మెట్లలా ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అందులో చాలా అర్థం కూడా ఉంది. ఓ కొండను తొలచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి సింహాసనంపై కూర్చున్నాడు చిరంజీవి. అంటే అతడి కష్టాన్ని ఆ ఫోటోలో చూపించారు. అదే విధంగా చిరు పుట్టిన రోజుకు అభిమానులు క్రియేట్ చేసిన ఓ వీడియోను హీరో వెంకటేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మెగాస్టార్ కు అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ తెలిపారు.
మొన్న మహేష్ బాబు బర్త్ డేకు ఏకంగా 6 కోట్ల మంది ట్వీట్స్ చేసారు. ఇప్పుడు చిరంజీవి బర్త్ డేను అంతకంటే గ్రాండ్‌గా చేయాలని ఫిక్స్ అయ్యారంటా మెగా ఫ్యాన్స్. దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ పుట్టిన రోజుకు ఓ కొత్త సినిమాతో పాటు ఆచార్య అప్ డేట్స్ కూడా ఇవ్వనున్నాడు.
Happy to be launching the Common DP to celebrate the birthday of Mega Star Chiranjeevi garu. #HBDMegastarChiranjeevi pic.twitter.com/73uk22ZPMx
— Ram Charan (@AlwaysRamCharan) August 21, 2020
Here's the Common Display motion Poster Of Megastar @kchirutweets garu made by his fans, Wishing him Many More happy Returns of the day!!#HBDMegastarChiranjeevihttps://t.co/vxDzT45gRC@sivacherry9 @nxtgen_studio @Sabari_Ramiro @allanpreetham @the_basithsyed pic.twitter.com/UaW6bhzfUR
— Venkatesh Daggubati (@VenkyMama) August 21, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire