Ram charan Donation: వరద బాధితుల కోసం రామ్ చరణ్ విరాళం.. ట్వీట్
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలకు సాయం చేసే దిశగా రామ్ చరణ్ విరాళం ప్రకటించారు.
Ram charan Donation: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్లుగా రామ్ చరణ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దుస్థితి నుండి త్వరగా బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని రామ్ చరణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను.
— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…
మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024
మనందరం ఏదో…
తెలంగాణ, ఏపీలో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలిచివేశాయని చిరంజీవి ఆవేదన వ్యక్తంచేశారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తంచేసిన చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగు పరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి అని తన ట్వీట్లో పేర్కొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire