Game Changer: స్క్రీన్‌పై తండ్రిని మొదటిసారి చూసి క్లీంకార కేకలు.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాసన

Game Changer: స్క్రీన్‌పై తండ్రిని మొదటిసారి చూసి క్లీంకార కేకలు.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాసన
x
Highlights

Ram Charan and Upasana's daughter Klinkaara: రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకార వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ట్విట్టర్...

Ram Charan and Upasana's daughter Klinkaara: రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకార వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ట్విట్టర్ వేదికగా ఉపాసన ఈ వీడియోను షేర్ చేశారు. క్లీంకార తన నాన్నను మొదటిసారిగా స్క్రీన్‌పై చూస్తోంది అంటూ వీడియో పంచుకున్నారు ఉపాసన.

ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను ఉపాసన ప్రదర్శించగా అందులో రామ్ చరణ్‌ను చూసి క్లీంకార ఆనందంతో కేకలు వేయడం వీడియోలో ఉంది. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నాను అని ఉపాసన ట్వీట్ చేశారు. ఈ వీడియోను మెగా అభిమానులు షేర్ చేస్తుండడంతో వైరల్ అవుతోంది.

ఇక క్లీంకారను ఇంతవరకు పూర్తిగా చూపించలేదు. ఈ సారి కూడా ఈ వీడియోలో క్లీంకార ఫేస్ కనిపించకుండా వెనక నుంచి వీడియో తీశారు. క్లీంకార తన తండ్రిని చూసి మురిసిపోతుంటే.. బ్యాక్ సైడ్ నుంచి ఉపాసన ఈ వీడియో షూట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలో క్లీంకార చేస్తున్న అల్లరిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సంక్రాంతి కానుకగా ఈ నెల 10న గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా విడుదలకానుంది ( Game Changer releasing date). ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీలో చరణ్ సరసన హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రియులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories