Ram Charan-Buchi Babu: రాంచరణ్-బుచ్చిబాబు మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..?

Ram Charan-Buchi Babu Movie Title and First Look Update Soon
x

Ram Charan-Buchi Babu: రాంచరణ్-బుచ్చిబాబు మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..?

Highlights

Ram Charan-Buchi Babu: రాంచరణ్-బుచ్చిబాబు మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ ఎప్పుడంటే..

Ram Charan-Buchi Babu: మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. భారీతనానికి మారుపేరుగా నిలిచే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అసాధారణ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇందులో చెర్రీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చరణ్ సరసన అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

గేమ్ ఛేంజర్ తర్వాత రాంచరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రావడంతో పాటు బుచ్చిబాబు సినిమాలో తన పాత్ర పాత్ బ్రేకింగ్ గా ఉంటుందని, రంగస్థలంలాంటి తన పాత రికార్డులను సైతం బీట్ చేస్తుందని రాంచరణ్ చెప్పడంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బుచ్చిబాబు సినిమాపై మెగా ఫ్యాన్స్ క్యూరియాసిటీ చూపిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రోజుకొక వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తాడని, స్పోర్ట్స్ బేస్డ్ గా ఉండే ఈ చిత్రాన్ని కోడిరామమూర్తి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్నిసార్లు తిరుగుబాటు అవసరం అవుతుంది అనే క్యాప్షన్ తో ఓ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ రివోల్ట్స్ అనే హ్యష్ ట్యాగ్ లో ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉంటే, బుచ్చిబాబు, రాంచరణ్ సినిమా టైటిల్ ని, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని, సెప్టెంబర్ లో షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ గుసగుసలాడుతున్నారు. ఈ వార్తలు విన్న మెగా అభిమానులు సంబరపడడమే కాకుండా సినిమాని త్వరగా పట్టాలెక్కించాలని కోరుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories