ఎర్రచందనం దొంగ హీరోనా అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్

Rajendra Prasad Clarifies Comments About Allu Arjun
x

ఎర్రచందనం దొంగ హీరోనా అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదం.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్

Highlights

Rajendra Prasad: ఎర్ర చందనం దొంగలను హీరోలుగా చూపిస్తున్నారంటూ ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

Rajendra Prasad: ఎర్ర చందనం దొంగలను హీరోలుగా చూపిస్తున్నారంటూ ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీని ఉద్దేశించే రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ వినిపించింది. దీంతో ఆయన ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ హరికథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. "నిన్న కాక మొన్న చూశాం.. వాడెవడో ఎర్ర చందనం దుంగల దొంగ... వాడు హీరో. ఇటీవల హీరో పాత్రలకు అర్థాలే మారిపోయాయి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్ నే లక్ష్యంగా చేసుకుని రాజేంద్ర ప్రసాద్ ఆ అభిప్రాయం వ్యక్తంచేశారని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. దీంతో ఆ కామెంట్స్‌పై రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ "తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు" అని స్పష్టం చేశారు.

తాను పుష్ప సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి మొదట నవ్వుకున్నట్టు తెలిపారు. తనకు బన్నీపై కామెంట్స్ చేసే తప్పుడు ఆలోచన లేదని.. బన్నీని తన బిడ్డలాగా భావిస్తానని అన్నారు. అల్లు అర్జున్ ఐ లవ్ యూ అని అన్నారు. తన 48 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనిది.. తాను నెగటివ్‌గా మాట్లాడినట్టు ఏదో వివాదాన్ని క్రియేట్ చేసినట్టు ఎవడో కలర్ ఇచ్చాడని వాడెవడో తెలియాలి అంటూ సీరియస్ అయ్యారు.

అల్లు అర్జున్ అంటే తనకు పిచ్చి ప్రేమ అని, బన్నీ తనకు బిడ్డలాంటివాడని మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. జులాయి, అలా వైకుంఠపురం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు బన్నీతో చేశానని.. తనకు అల్లు అర్జున్‌కు ఉన్న రిలేషన్ ఏంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసునన్నారు. అలాగే అజ్ఞానంతో, అవివేకంతో తనని నెగిటివ్ షేడ్‌లో చూపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వార్తలు రాసి ఉంటారని రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories