డబ్బింగ్ సినిమా వల్ల 'కల్కి' వాయిదా పడిందా?

డబ్బింగ్ సినిమా వల్ల కల్కి వాయిదా పడిందా?
x
Highlights

'పిఎస్వి గరుడ వేగా' సినిమాతో హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ తాజాగా 'కల్కి' అనే సినిమాతో త్వరలో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే...

'పిఎస్వి గరుడ వేగా' సినిమాతో హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ తాజాగా 'కల్కి' అనే సినిమాతో త్వరలో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇంతకుముందు ఈ సినిమాని మే 31వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు కానీ తీరా చూస్తే అదే రోజున నాలుగు తెలుగు సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. సూర్య హీరోగా నటించిన 'ఎన్ జీ కే', జయప్రద 'సువర్ణసుందరి', 'అభినేత్రి 2', 'ఫలక్నుమా దాస్' సినిమాలు కూడా అదే రోజున బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో లో రాజశేఖర్ 'కల్కి' సినిమా ఆ తేదీ నుంచి వెనుకంజ వేయనుందని వార్తలు బయటకు వస్తున్నాయి. ఒకపక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సవ్యంగా సాగుతున్న ఈ సమయంలో సినిమాని వాయిదా వేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

అన్ని సినిమాలు ఒకేసారి విడుదల అవడం వల్ల థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి వాయిదా వేయడానికి సిద్ధం అవుతున్నారని కొందరు సినిమాను వెనకేసుకొస్తున్నారు కానీ కంటెంట్ ఉంటే డి.సురేష్ బాబు, దిల్ రాజు వంటి థియేటర్ ఓనర్లు, పంపిణీ దారులు ఉన్నప్పటికీ జీవిత5 అండ్ టీం సినిమాను వాయిదా వేయడం ఏమిటని సందేహాలు తలెత్తుతున్నాయి. కొందరేమో సూర్య హీరోగా నటించిన 'ఎన్ జీ కే' సినిమా కూడా అదే రోజు విడుదల అవడం వల్లనే రాజశేఖర్ సైడ్ అయినట్లుగా పుకార్లు సృష్టిస్తున్నారు. కానీ డబ్బింగ్ సినిమా విడుదల కాబోతోందని తెలుగు సినిమా సైడ్ అయిపోవటం ఏమిటని మరికొందరు వేలెత్తి చూపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories