Rajamouli Tweet: దిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులు చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Rajamouli Tweet: ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులు చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్ లో కనీస వసతులు కూడా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తిపరమైన పనుల రీత్యా బుధవారం అర్ధరాత్రి దిల్లీ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఆయన అక్కడ ఉన్న పరిస్థితుల గురించి తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. ఆ పత్రాలు నింపడం కోసం కొంతమంది ప్రయాణికులు గోడలకు ఆనుకుని.. మరి కొంతమంది నేలపైనే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చారు. అక్కడ పరిస్థితి చూడడానికి ఏమీ బాలేదు. ఇటువంటి వాటి కోసం చిన్న టేబులైనా ఏర్పాటు చేయాల్సింది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి ' అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి కేజ్రీవాల్ సర్కార్ స్పందించి విమానాశ్రయంలో కనీస వసతలు కల్పిస్తారేమో వేచి చూడాల్సిందే మరి.
Dear @DelhiAirport,
— rajamouli ss (@ssrajamouli) July 2, 2021
arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passenges are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire