Rajamouli Tweet on Plasma : కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది.
Rajamouli Tweet on Plasma : కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఇందులో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖుల పైన ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. అందులో భాగంగానే దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. తాజాగా వారు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ప్లాస్మా దానం చేస్తామని దర్శకుడు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే..
అందులో భాగంగానే కీరవాణి ఆయన తనయుడు భైరవ కిమ్స్ హాస్పిటల్‌లో ప్లాస్మాను డొనేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను జత పరుస్తూ ట్వీట్ చేశారు అయన.. అంతేకాకుండా రక్తదానం చేసినట్టే ఉంది. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే దర్శకుడు రాజమౌళి తానూ డొనేట్ చేయకపోవడానికి గల కారణాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. " మన శరీరంలోని ప్రతిరక్షకాల కోసం పరీక్షలు నిర్వహించారు. అయితే, నా ఇమ్యునోగ్లోబులిన్ స్థాయి 8.62 మాత్రమే ఉంది. ప్లాస్మా దానం చేయాలంటే 15 కంటే అధికంగా ఉండాలి" అందుకే ప్లాస్మా డొనేట్ చేయలేకపోయానని వెల్లడించాడు ఈ దర్శధీరుడు. ఇక కరోనా నుంచి కోలుకున్నవారు ముందుకు వచ్చి దానం చేసి మరొకరి లైఫ్ సేవర్ గా నిలవాలని కోరుతున్నట్లుగా వెల్లడించారు రాజమౌళి..
Tested for antibodies.. My igG levels are 8.62. They should be above 15 to be able to donate... Peddanna and Bhairava donated today... pic.twitter.com/5zVmj0dvt0
— rajamouli ss (@ssrajamouli) September 1, 2020
ఇక ప్రస్తుతం రాజమౌళి RRR అనే సినిమాని చేస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire