Pornography Case: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ ఎపిసోడ్ లో ప్లాన్ బీ

Raj Kundra had plan B to Evade Arrest in Pornography Case
x

Pornography Case: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ ఎపిసోడ్ లో ప్లాన్ బీ

Highlights

Pornography Case: కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి.

Pornography Case: కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. పోర్న్‌ కంటెంట్ కోసం ఏర్పాటు చేసిన హాట్‌షాట్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ నుంచి తొలగించగానే కుంద్రా అండ్ కో ప్లాన్‌-బి అమలు చసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ తేల్చింది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి కొత్త దందాను కొనసాగించినట్లు పోలీసులు వెల్లడించారు.

ప్లాన్-బీలో భాగంగా ఏకంగా ఇంటిలిజెన్స్ బ్యూరోకి చెందిన ప్రముఖ వ్యక్తిని తనకు తెలీకుండానే బోల్తా కొట్టించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఎప్పటికైనా అరెస్ట్ కావడం ఖాయమని భావించిన కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకూర్ ఐబీకి చెందిన అధికారితో ఫ్రెండ్‌షిప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అవార్డు విన్నింగ్ షార్ట్‌ఫిల్మ్స్‌ కోసం ఓ యాప్‌ను రూపొందిద్దామని చెప్పడంతో ఆ అధికారి తన భార్య పేరుమీద బాలీఫేమ్ యాప్‌ను రిజిస్టర్ చేశాడు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలిసి షాక్ అయినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories