ఇప్పటికి చాలా రిలేషన్స్ లో ఉన్నా అంటున్న రాయిలక్ష్మి

ఇప్పటికి చాలా రిలేషన్స్ లో ఉన్నా అంటున్న రాయిలక్ష్మి
x
Highlights

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఈ మధ్యనే 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' అనే హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో...

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ ఈ మధ్యనే 'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' అనే హారర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. అయితే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలలో లో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది రాయి లక్ష్మి. ఎప్పటి కప్పుడు హాట్ ఫోజులు ఇస్తూ తన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే రాయ్ లక్ష్మీ వాటి గురించి మాట్లాడుతూ

"నేను ఎక్కడికెళ్ళినా మెమొరీగా ఉంటుందని సెల్ఫీలు తీసుకుంటా. మొన్న ముంబైకి వెళ్ళా, అక్కడ బికినీ చాలా కామన్. నేను పోస్ట్ చేసింది ఆ ఫోటోలే. అవి పబ్లిసిటీ కోసం కాదు. నన్ను బికినీలో చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి." అంటూ ఘాటుగా స్పందించింది. తన లవ్ ఎఫైర్స్ గురించి అడిగితే, "నా జీవితంలో జరిగిన విషయాలను నేను దాయాలని అనుకోని కానీ అవన్నీ పబ్లిక్ గా కూడా చెప్పుకోవడం ఇష్టం లేదు. నేను చాలామందితో రిలేషన్లో ఉన్నమాట నిజమే. వాటి గురించి చెప్పాలంటే టైం సరిపోదు" అని షాకిచ్చింది. ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని వర్తలు వచ్చాయి అని అడిగితే గట్టిగా నవ్వేసి అవన్నీ కేవలం పుకార్లు అని కొట్టిపారేసింది. కాబోయే భర్త ఎలా ఉండాలని అనుకుంటున్నారంటే, తన భర్తను ఎంచుకోవడం పూర్తిగా తన ఛాయిస్ అని, తన కుటుంబ సభ్యలు ఓపెన్ మైండెడ్ అని, వాళ్ళు తనకు ఆ స్వేచ్చ ఇచ్చారని చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories