Radhika Apte: ముక్కు సరిచేసుకో.. బ్రెస్ట్ సైజు పెంచుకోమన్నారు..

Bollywood Actress Says South Actor Made Lewd Comments
x

సౌత్ నటుడు అసభ్యకరమైన కామెంట్లు చేశాడు అంటున్న బాలీవుడ్ నటి

Highlights

Radhika Apte: సౌత్ లో జరిగిన ఒక షాకింగ్ ఘటన గురించి చెబుతున్న రాధిక ఆప్టే

Radhika Apte: ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఉన్న అందరి వెనుక ఎన్నో ఇబ్బందులు పడ్డ రోజులు కూడా ఉండే ఉంటాయి. ఎంత టాలెంట్ ఉన్నా నటీనటులైన తమ కెరియర్ లో ఏదో ఒక సమయంలో రిజెక్షన్ ని ఎదుర్కొని ఉంటారు. ట్రోలింగ్ ఎదుర్కొని ఉంటారు. తాజాగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటి రాధిక ఆప్టే సౌత్ లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి బయట పెట్టింది. ఒక సౌత్ నటుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని తన శరీరం గురించి కామెంట్లు చేశాడు అని చెబుతోంది.

రాధిక ఆప్టే తన కెరీర్ మొదట్లో జరిగిన ఆ సంఘటనను గుర్తుతెచ్చుకుంటూ ఇకపై అలాంటి కామెంట్లు విని భరించడానికి తాను సిద్ధంగా లేనని చెబుతోంది. ఇకపై అలాంటి కామెంట్లు ఎదురైనా కూడా తాను కచ్చితంగా అడిగిన వ్యక్తిని నిర్మొహమాటంగా దండిస్తానని చెబుతోంది. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న రాధిక ఆప్టే అప్పట్లో తనకి ఒకరు అవకాశాల కోసం ముక్కు సరి చేయించుకోమని బ్రెస్ట్ పెద్దగా ఉండాలని అన్నారని చెప్పుకొచ్చింది రాధిక. "కొంతమంది ఆలోచన విధానం చాలా వింతగా ఉంటుంది.

చాలా కాలం పాటు కొంతమంది నేను కేవలం ఒక పల్లెటూరు అమ్మాయి లాగానే ఉండగలనని అనుకున్నారు. అప్పుడే నేను బద్లాపూర్ సినిమా చేశాను. ఆ సినిమా తర్వాత మళ్లీ నేను కేవలం సెక్స్ కామెడీస్ మాత్రమే చేయగలనని కొంతమంది అన్నారు. నేనెప్పుడూ వారికి అవును అని చెప్పలేదు కానీ వారి ఆలోచన విధానం చాలా చెడ్డది. ఒక మూడు నాలుగు కేజీలు ఎక్కువగా ఉన్నానని నేను ఒక సినిమాలో అవకాశాన్ని కూడా కోల్పోయాను. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు నీ ముక్కు సరి చేయించుకో, బ్రెస్ట్ పెంచుకో అని చాలామంది కామెంట్లు చేశారు కానీ అది కెరీర్ మొదట్లోనే," అని చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories