Pushpa 2 Ticket Price: పెరిగిన 'పుష్ప 2' టికెట్స్ ధరలు.. బెనిఫిట్ షో ప్రైజ్ ఎంతో తెలుసా?

Pushpa 2 Ticket Price Hiked In Telangana
x

Pushpa 2 Ticket Price: పెరిగిన 'పుష్ప 2' టికెట్స్ ధరలు.. బెనిఫిట్ షో ప్రైజ్ ఎంతో తెలుసా?

Highlights

Pushpa 2 Ticket Price: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది.

Pushpa 2 Ticket Price: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ఓ వైపు చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 పై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ఫ ది రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ పై మరింత హైప్ నెలకొంది. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది.. సినిమాపై హైప్స్ పెంచేలా కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి.

డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్థరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఏదైనా సరే రూ.800గా టికెట్ ధర నిర్ణయించారు. ఇక అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్ లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీప్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పుష్ప2 సినిమా మొత్తం ఆరు భాషలలో 12 వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్ లో విడుదలవుతున్న భారతీయ సినిమా ఇది. సినీ డబ్స్ యాప్ సాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాను ఆస్వాధించే అవకాశం కూడా ఉందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్-10 నటుల జాబితాలో అల్లు అర్జున్ రూ.300 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. పుష్ప2 కోసం ఆయన ఈ స్థాయిలో పారితోషికం అందుకున్నట్టు తన కథనంలో పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories