Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్... ఎవరు ఎంత తీసుకున్నారు?

Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక మందన, సుకుమార్... ఎవరు ఎంత తీసుకున్నారు?
x
Highlights

Pushpa 2 movie total collections world wide and remunerations: పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా తొలి...

Pushpa 2 movie total collections world wide and remunerations: పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా తొలి 5 రోజుల్లోనే రూ. 900 కోట్ల కలెక్షన్స్ దాటేసినట్లు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. పుష్ప 2 మూవీ రిలీజ్ కాకముందు నుండే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే టాపిక్ ఫుల్ వైరల్ అయింది. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం రూ. 300 కోట్ల పారితోషికం తీసుకున్నాడని వార్తలొచ్చాయి. ఫోర్బ్స్ కూడా ఇదే విషయమై ఒక వార్తా కథనాన్ని కూడా ప్రచురించింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన జంటగా నటించిన రష్మిక మందన, పుష్ప 2 మూవీ డైరెక్టర్ సుకుమార్ ఎంత పారితోషికం తీసుకున్నారనేదే పెద్దగా హైలైట్ అవలేదు.

పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఎంత తీసుకున్నాంటున్నాడు?

తాజాగా అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందనలు ఎంత ఎంత తీసుకున్నారనే అంశంపై సోషల్ మీడియాలో పలు కథనాలొస్తున్నాయి. తాజాగా ఇండియాటుడే కూడా ఇదే విషయమై ఒక వార్తను ప్రచురిస్తూ అందులో కొన్ని లెక్కలు బయటపెట్టింది. పుష్ప 2 మూవీ లాభాల్లో అల్లు అర్జున్ 40 శాతం తీసుకుంటున్నాడని ఆ కథనం చెబుతోంది. అంతకు మించి అల్లు అర్జున్ ఈ సినిమాకు సైన్ చేసినందుకు వేరే పారితోషికం ఏం తీసుకోవడం లేదని అందులో పేర్కొన్నారు.

పుష్ప పార్ట్ 1 మూవీకి కూడా పుష్పరాజ్ ఇదే పద్ధతిని అనుసరించాడట. బాలీవుడ్‌లో కొంతమంది స్టార్ హీరోలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. టాలీవుడ్‌లోనూ మహేష్ బాబు లాంటి కొంతమంది స్టార్ హీరోలు సినిమాకు సైన్ చేసే పద్ధతి అలాగే ఉంటుందని టాక్.

రష్మిక మందన పారితోషికం ఎంతంటే...

పుష్ప: ది రైజ్ మూవీ కోసం అప్పట్లో రష్మిక మందన రూ. 3 కోట్లు పారితోషికం చార్జ్ చేశారట. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు పుష్ప 2 మూవీపై కూడా భారీ అంచనాలు ఏర్పడటంతో ఈసారి రూ. 8 కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. రష్మికకు ఉన్న ప్యాన్ ఇండియా క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఆమె డిమాండ్‌కు నో చెప్పకుండా ఒప్పుకున్నారని టాక్. అంతేకాదు.. పుష్ప 2 మూవీ భారీ హిట్ అవడంతో ఇంకొంత అదనపు మొత్తం కలిపి రూ. 11-12 కోట్ల వరకు ఆమెకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

మరి పుష్ప 2 కోసం డైరెక్టర్ సుకుమార్ రెమ్యునరేషన్ సంగతేంటి?

ఏ సినిమాకైనా షిప్‌కు కేప్టేన్ ఎలాగో.. డైరెక్టర్ అలా. రెడ్ శాండల్ స్మగ్లర్ అనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తీసుకుని హీరోగా ప్రెజెంట్ చేసిన సుకుమార్ ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడని నెటిజెన్స్ గూగుల్ చేస్తున్నారు. తాజాగా వస్తున్న అప్ డేట్స్ ప్రకారం పుష్ప 2 కోసం సుకుమార్ సినిమా లాభాల్లో 30 శాతం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 లాభాల్లో చిత్ర నిర్మాతలు, సుకుమార్ చెరో 30 శాతం తీసుకుంటారని టాక్. అంటే పుష్ప 2 మూవీ లాభాల్లో ఎక్కువ షేర్ ఎంజాయ్ చేసేది అల్లు అర్జున్ అన్నమాట అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories