Pushpa 2: అల్లు అర్జున్ రాకతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

Pushpa 2: అల్లు అర్జున్ రాకతో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
x
Highlights

Allu Arjun fan died in a Stampede at Sandhya theatre during Pushpa 2 screening: పుష్ప 2 సినిమా చూసేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని...

Allu Arjun fan died in a Stampede at Sandhya theatre during Pushpa 2 screening: పుష్ప 2 సినిమా చూసేందుకు అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ కు వచ్చాడు. అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం అందుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. దీంతో థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురయ్యారు.

ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తోన్న చిక్కడపల్లి ఎస్సై రాజు నాయక్, ఎస్సై మోనికా తమ సిబ్బందితో కలిసి వారికి రక్షణగా నిలిచి సీపీఆర్ చేశారు. ఆ తరువాత వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేవతి అనే 35 ఏళ్ల మహిళ మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories