Pushpa 2 Public Talk: పుష్ప 2 మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..

Pushpa 2 Public Talk: పుష్ప 2 మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే..
x
Highlights

Pushpa 2 Public Talk and Pushpa 2 Movie Public Review: పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ చూసిన...

Pushpa 2 Public Talk and Pushpa 2 Movie Public Review: పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ చూసిన తరువాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెబుతున్న మాట ఇది. అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ పర్‌ఫార్మెన్స్ పుష్ప పార్ట్ 1 మూవీ కంటే పుష్ప 2 మూవీలో ఇంకా చాలా బాగుందంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఫస్ట్ డేనే పుష్ప 2 మూవీ రూ. 300 కోట్ల కలెక్షన్ రాబడుతుందని, ఓవరాల్‌గా రూ. 2000 కోట్లు వసూలు చేస్తుందని అల్లు అర్జున్ అభిమానులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

పుష్ప 2 మూవీ గురించి అల్లు అర్జున్ అభిమాని మరొకరు మాట్లాడుతూ తన హుషారును అంతా ప్రదర్శించారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజైనప్పటి నుండి ఇప్పటి వరకు తాను స్టేటస్ కానీ యూట్యూబ్‌లో కానీ ఎలాంటి ప్రమోషన్ చేయలేదన్నారు. కేవలం సినిమానే మాట్లాడుతదని తాను సైలెంట్‌గా ఉన్నానని, ఇప్పుడు సినిమానే మాట్లాడుతుందని ఆయన కామెంట్ చేశారు.

మరొక అభిమాని మాట్లాడుతూ సినిమాలో ప్రతీది తగ్గేదెలా అన్నట్లుగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కించారని చెప్పుకొచ్చారు. పుష్ప 2 మూవీ మరొకసారి తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేలా ఉందని ఆ అభిమాని అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories