Pushpa 2 Collections: పుష్ప2 తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా.? ఎన్ని కోట్టు రాబట్టిందంటే..

Pushpa 2 Collections
x

Pushpa 2 Collections: పుష్ప2 తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా.? ఎన్ని కోట్టు రాబట్టిందంటే..

Highlights

Pushpa 2 Box Office Collections: మొదటి రోజు పుష్ప ఏకంగా రూ. 175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Pushpa 2 Box Office Collections: భారీ అంచనాల నడుమ దాదాపు మూడేళ్లపాటు నిర్మాణం జరుపుకున్న పుష్ప2 చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ మూవీ. అంచనాలకు అనుగుణంగా ఓపెనింగ్స్‌ రాబడుతూ పుష్ప2 దూసుకుపోతోంది. ఓవర్‌సీస్‌తో పాటు దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

అల్లు అర్జున్‌ అద్భుత నటన, సుకుమార్‌ మేకింగ్ స్టైల్‌ జనాలను సినిమా థియేటర్లకు రప్పిస్తుందంటున్నారు. డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచి ప్రీమియర్స్‌తో పుష్ప హంగామా మొదలైంది. ఇక మొదటి రోజు పుష్ప ఏకంగా రూ. 175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తంలో ఏపీ, తెలంగాణ వాట ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 మంచి కలెక్షన్లను రాబడుతోంది. దేశవ్యాప్తంగా మంచి బజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా అన్ని చోట్ల కలెక్షన్లను రాబడుతోంది. ఇక అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు ఏకంగా 4.2 మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 35 కోట్లు వసూలు చేసిందన్నమాట. అమెరికాలో ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన మూడో భారతీయ చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది.

ఇక ప్రీ సేల్ బుకింగ్స్‌లో కూడా పుష్ప2 అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రముఖ సినిమా టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన బుక్‌ మై షోలో ఒక్క గంటలోనే లక్ష టికెట్స్‌ అమ్ముడుపోవడం విశేషం. గతంలో ప్రభాస్‌ హీరోగా వచ్చిన కల్కి సినిమా గంటలో 97,700 టికెట్స్‌ బుక్‌ అయ్యాయి. అప్పట్లో అదే ఒక రికార్డుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఇక థియేటర్లలో మరే సినిమా లేకపోవడం, మంచి టాక్‌ రావడంతో పుష్ప 2 కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories