Pushpa 2 Box Office Collections: కలెక్షన్ల విషయంలో అస్సలు తగ్గేదేలే.. పుష్ప2 ఇప్పటి వరకు ఎంత రాబట్టిందో తెలుసా?

Pushpa 2 Movie Collections Worldwide Till Now
x

Pushpa 2 Box Office Collections: కలెక్షన్ల విషయంలో అస్సలు తగ్గేదేలే.. పుష్ప2 ఇప్పటి వరకు ఎంత రాబట్టిందో తెలుసా?

Highlights

Pushpa 2 Box Office Collections: పుష్ప2 సృష్టిస్తోన్న కలెక్షన్ల సునామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Pushpa 2 Box Office Collections: పుష్ప2 సృష్టిస్తోన్న కలెక్షన్ల సునామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప2 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పాత రికార్డులన్నింటినీ తిరగరాసిందీ మూవీ. భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని రికార్డులను పుష్ప2 బ్రేక్‌ చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నాలుగు వారాల్లో ఏకంగా రూ. 1799 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించినట్లు చిత్రయూనిట్‌ తెలిపింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. ‘పుష్ప2: ది రూల్‌’ రికార్డు బ్రేకింగ్‌ రన్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తోంది. వైల్డ్ ఫైర్‌ బ్లాక్‌బస్టర్‌ నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1799 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే హిందీలో పుష్ప గాడి రూల్‌ కొనసాగుతూనే ఉంది. ఒక్క హిందీ వర్షన్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ హిందీ వెర్షన్‌ సినిమా సాధించిని రికార్డుగా పుష్ప2 నిలిచింది. ఇక సినిమా టికెట్ల విషయంలో కూడా పుష్ప2 సరికొత్త రికార్డును సృష్టించింది. బుక్‌మై షోలో ఇప్పటి వరకు 19.5 మిలియనట్లు టికెట్లు అమ్ముడు పోయాయి. ఇప్పటి వరకు బాహుబలి2 పేరుతో ఉన్ని రికార్డును బద్దలు కొట్టిందీ మూవీ.

కాగా పుష్ప2 మరో అరుదైన ఘనతను సాధించడం ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది. పుష్ప2 రూ. 2 వేల కోట్ల క్లబ్‌లోకి చేరడం పెద్ద విషయమేమి కాదని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్రాంతి దగ్గరల్లోనే ఉండడంతో మరికొన్ని రోజులు పుష్ప2 రన్‌ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పుష్ప2 రూ. 2 వేల కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories