ముంబయి మెట్రో రైలుపై 'పుష్ప'... వీడియో ఇదిగో!

ముంబయి మెట్రో రైలుపై పుష్ప... వీడియో ఇదిగో!
x
Highlights

ముంబాయి మెట్రో రైళ్లలో ప్రతి కంపార్ట్ మెంట్ పైన పుష్ప2 చిత్రం పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2తో వస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు రెండురోజులే సమయం ఉండడంతో మూవీ టీమ్ అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సినిమా ప్రమోషన్ చేపట్టింది. ఈ క్రమంలో ముంబాయి మెట్రో రైళ్లపైన పుష్ప2 చిత్రాన్ని బ్రాండింగ్ చేస్తున్నారు. ముంబాయి మెట్రో రైళ్లలో ప్రతి కంపార్ట్ మెంట్ పైన పుష్ప2 చిత్రం పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



పుష్ప2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో వాటికి తగ్గట్టే మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి.. మూవీపై హైప్ పెంచారు. తాజాగా ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప2 మూవీ ప్రోస్టర్లను అతికించి, ప్రమోషన్ చేస్తున్నారు. ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories