Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాటపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్

Pushpa 2: సంథ్య థియేటర్ తొక్కిసలాటపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్
x

Pushpa 2: సంథ్య థియేటర్ తొక్కిసలాటపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్

Highlights

పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది

Pushpa 2: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన ఘటనపై అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమైందిగా చెప్పారు. త్వరలోనే తమ బృందం బాధిత కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందించనుందని ఆ టీమ్ ప్రకటించింది.

జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో కాంగ్రెస్ బహిష్కృత నాయకులు బక్క జడ్సన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ తొక్కిసలాటలో మహిళ మృతికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాత బాధ్యత వహించాలని ఆయన ఆ పిటిషన్ లో చెప్పారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. బాధితురాలి కుటుంబానికి రూ. 10 కోట్ల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు,

పుష్ప అంటూ పిలుచుకునేవారు

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించిన రేవతి కొడుకు అల్లు అర్జున్ అభిమాని. దీంతో పుష్ప 2 సినిమా చూసేందుకు రేవతి, ఆమె భర్త కొడుకుతో కలిసి సంధ్య థియేటర్ కు వచ్చారు. సినిమా థియేటర్ లోకి రేవతి, ఆమె కొడుకు వెళ్లారు. ఆ తర్వాత రేవతి భర్త వెళ్లారు. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చిన సమయంలో అభిమానుల తాకిడి పెరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని రేవతి భర్త భాస్కర్ మీడియాకు చెప్పారు.

సంధ్య థియేటర్ వద్ద ప్రజా సంఘాల ధర్నా

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను నిరసిస్తూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories