భారీ బడ్జెట్ తో పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా

Puri Jagannadh Next Film with a Huge Budget
x

భారీ బడ్జెట్ తో పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా

Highlights

భారీ బడ్జెట్ తో పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా

Puri Jagannadh: "ఇష్మార్ట్ శంకర్" సినిమా తో సూపర్ హిట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు "లైగర్" తో బిజీగా ఉన్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలనుకుంటున్నారు. అందులో కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిజానికి పూరి జగన్నాథ్ ఈ సినిమాని మహేష్ బాబుతో తీయాలని అనుకున్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ని లైన్ లో పెట్టారు పూరి. ఇక ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ధర్మ ప్రొడక్షన్స్ 100 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ ఇంత భారీ బడ్జెట్ సినిమాలో పని చేసింది లేదు. కానీ పూరి జగన్నాథ్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ "లైగర్" సినిమా గనుక సూపర్ హిట్ అయితే ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొంటాయి. అప్పుడు "జన గణ మన" మీద కూడా హైప్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories