Dasara: "దసరా" రైట్స్ ని తిరిగి కొనుగోలు చేస్తున్న నిర్మాతలు

Producers Repurchasing Dasara Rights
x

Dasara: "దసరా" రైట్స్ ని తిరిగి కొనుగోలు చేస్తున్న నిర్మాతలు

Highlights

Dasara: "దసరా" సినిమా రైట్స్ ను మళ్లీ కొనబోతున్న నిర్మాత

Dasara: నాచురల్ స్టార్ నాని హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాని ఒక రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నారు. తెలంగాణ గోదావరిఖని లోని సింగరేణి బొగ్గు గని బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మధ్యనే ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

తన ఊర మాస్ లుక్కుతో నాని అందరి దృష్టిని బాగానే ఆకట్టుకున్నారు. ఈ ఒక్క టీజర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పటికే చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి సినిమా థియేట్రికల్ రైట్స్ ను పెద్ద అమౌంట్ కి అమ్మేశారు. ఒక థర్డ్ పార్టీ వారు దసరా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే దసరా థియేట్రికల్ రైట్స్ ను 23 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఆ తర్వాత వారు దిల్ రాజుకి 28 కోట్లకు రైట్స్ ను అమ్మేశారు. ఇక ఆ సినిమాని నిర్మాత 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

సినిమా శాటిలైట్ మరియు ఓటీటీ రైట్స్ తో ఇంకా భారీ మొత్తాన్ని నిర్మాతలు వెనకేసుకోవచ్చు. అయితే తాజా సమాచారం ప్రకారం నిర్మాత సుధాకర్ చెరుకూరి ఇప్పుడు సినిమా థియేటర్లు రైట్స్ ని కూడా తిరిగి కొనుగోలు చేయాలని అనుకుంటున్నారట. సినిమాపై రోజురోజుకీ పెరుగుతున్న బజ్ ను దృష్టిలో పెట్టుకొని తామే సొంతంగా సినిమాని రిలీజ్ చేస్తే బాగుంటుందని సుధాకర్ ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చ్ 30న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories