Baahubali 3: బాహుబలి3 రానుందా.? నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Producer Gnanavel Interesting Comments About Bahubali 3 Movie
x

Baahubali 3: బాహుబలి3 రానుందా.? నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Highlights

Baahubali 3: ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Baahubali 3: ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయిని బాహుబలి మరో మెట్టు ఎక్కించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే ప్రభాస్‌ ఇంటర్నేషనల్‌ హీరోగా ఎదిగారు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త మాహిష్మతి ప్రపంచాన్ని చూపించింది.

ఇదిలా ఉంటే బాహుబలి3 చిత్రానికి సంబంధించి అడపాదడపా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు దర్శకుడు రాజమౌళి కానీ నిర్మాతలు కూడా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదు. తాజాగా ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి చిత్రానికి కోలీవుడ్‌లో నిర్మాతగా వ్యవహరించింది జ్ఞానవేలే. ప్రస్తుతం కంగువా సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తున్న జ్ఞానవేల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

కంగువా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్‌ 3 ప్లాన్‌ చేసే పనిలో ఉన్నారు. దాని కంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయి. వాటి తర్వాతే ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ రిలీజ్‌ అవుతాయి’ అని చెప్పారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్‌గా మారాయి. బాహుబలి 3 ఉండనుందన్న వార్తలకు జ్ఞానవేల్‌ కామెంట్స్‌ బలం చేకూర్చాయి.

ఇదిలా ఉంటే గతంలోనూ రాజమౌళి బాహుబలి 3 ఉంటుందని ప్రకటించారు.‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు మూడో పార్ట్‌లో చూపిస్తామని అందుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నామన్నారు. నిర్మాత శోభు కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేశారని రాజమౌళి తెలిపారు. అయితే సినిమా రావడానికి మాత్రం సమయం పడుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం మహేష్‌తో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే ప్రభాస్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే బాహుబలి 3 రావాలంటే కనీసం ఓ ఐదేళ్లయినా ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories