Bandla Ganesh: ఏదో మూడ్‌లో ఉండి నోరు జారాను.. బండ్ల గణేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Producer bandla ganesh says sorry to trivikram
x

Bandla Ganesh: ఏదో మూడ్‌లో ఉండి నోరు జారాను.. బండ్ల గణేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు 

Highlights

అయితే దీనిపై తాజాగా బండ్ల గణేశ్‌ ఓపెన్‌ అయ్యారు. గబ్బర్‌సింగ్ రీ రిలీజ్‌ సందర్భంగా ఈ విషయమై స్పందించారు.

కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించి బడా నిర్మాతగా ఎదిగారు బండ్ గణేష్‌. పలు బడా చిత్రాలు నిర్మించి మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. కాగా గతంలో ఓసారి బండ్ల గణేశ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దర్శకుడు త్రివిక్రమ్‌కు సంబంధించి ఫోన్‌ కాల్‌లో బండ్ల గణేశ్‌ మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో రికార్డ్‌ అయింది.

అయితే దీనిపై తాజాగా బండ్ల గణేశ్‌ ఓపెన్‌ అయ్యారు. గబ్బర్‌సింగ్ రీ రిలీజ్‌ సందర్భంగా ఈ విషయమై స్పందించారు. ‘తీన్‌మార్‌ సరిగ్గా ఆడక నిరాశలో ఉన్నప్పుడు పవన్‌ మిమ్మల్ని పిలిచి గబ్బర్‌సింగ్‌కు అవకాశం ఇచ్చారు. అప్పుడు మీ ఫీలింగ్‌ ఏమిటి?’ అని విలేకరి ప్రశ్నించగా ఆయన ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ విషయమై బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. తీన్‌మార్‌ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని అనుకున్నానని. మనసుని హత్తుకునే భావోద్వేగాలు అందులో ఉంటాయి. చిన్న చిన్న సమస్యల వల్ల అది మిస్‌ ఫైర్‌ అయ్యిందని చెప్పుకొచ్చారు.

తీన్‌మార్‌ ఫ్లాప్‌ వల్ల బాధలో ఉన్నసమయంలో గబ్బర్‌ సింగ్ గురించి మొదట తనకు చెప్పింది త్రివిక్రమేనని చెప్పారు. ఇందుకు త్రివిక్రమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఓ అభిమాని ఓ ఫోన్‌ చేసిన సమయంలో ఏదో మూడ్‌లో ఉండి కాస్త నోరు జారానని, అప్పుడు చాలా తప్పు చేశాననిపించిందని ఓపెన్‌ అయ్యారు బండ్ల. అయితే ఆ తర్వాత వారిద్దరి మాట్లాడుకున్నామన్నారు. ఈసందర్భంగా త్రివిక్రమ్‌కు క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.

ఇక తీన్‌మార్‌ చిత్రాన్ని కూడా రీరిలీజ్‌ చేస్తానని బండ్ల గణేశ్‌ తెలిపారు. ఫ్లాప్‌ అయిన పవన్‌ సినిమాని కూడా రీ రిలీజ్‌ చేసి సూపర్‌ హిట్‌ చేయాలనేది తన కోరిక అన్నారు. ఇక తాను ప్రాణం పోయినా పవన్‌ను విమర్శించనని, అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు ఇంకోరకంగా మాట్లాడను అని అన్నారు. తన మనసుకు నచ్చకపోతే దేవుడినైనా ఎదురిస్తా. నచ్చితే వాళ్ల కాళ్లు పట్టుకుంటా. అది నా స్వభావం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో బండ్ల గణేశ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories