Bandla Ganesh ready to donate Plasma :టాలీవుడ్ సినీ ప్రముఖుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా సోకిందన్న విషయం అందరికి తెలిసిందే
Bandla Ganesh ready to donate Plasma : టాలీవుడ్ సినీ ప్రముఖుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా సోకిందన్న విషయం అందరికి తెలిసిందే.. తాజగా అయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా కరోనా నుంచి కోలుకున్నట్టుగా పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్‌ను కూడా షేర్ చేశారు బండ్ల.. అయన కరోనా నుండి కోలుకోవటంతో అయన అభిమానులు ఉపిరి పీల్చుకున్నారు. అయితే కరోనా చికిత్సలో భాగమైన ప్లాస్మాను తానూ దానం చేయడానికి సిద్దమని అయన తెలిపారు.
తాజాగా సోషల్ మీడియాలో దీనిపైన స్పందించిన బండ్ల.. తాను ప్లాస్మా ఇవ్వడానికి రెడీగా వున్నానని, కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్ రోగికి ఇవ్వడంతో అతను త్వరగా కోలుకునే అవకాశం ఉందని అన్నారు. ప్లాస్మా ఇవ్వడం తానూ ఒక డ్యూటి లాగా భావిస్తున్నట్టుగా గణేష్ వెల్లడించారు. ఇక అటు కరోనా నుంచి తానూ కోలుకోవడానికి ఎంతో కృషి చేసిన వైద్య బృందానికి, దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా బండ్ల వెల్లడించారు.
తెలుగు సినిమా ల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో మొదలగు చిత్రాలు నిర్మించాడు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు గణేష్!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire