Jaya Prakash Reddy : జేపీ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు : ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్!

Jaya Prakash Reddy : జేపీ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు : ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్!
x

modi, jaya prakash reddy

Highlights

Jaya Prakash Reddy : తెలుగు ఇండస్ట్రీ మరో గొప్ప నటుడుని కోల్పోయింది. విలన్ గా, కమెడియన్ గా దాదాపుగా మూడు దశాబ్దాల పాటు తెలుగు

Jaya Prakash Reddy : తెలుగు ఇండస్ట్రీ మరో గొప్ప నటుడుని కోల్పోయింది. విలన్ గా, కమెడియన్ గా దాదాపుగా మూడు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు జయప్రకాశ్ రెడ్డి గుండెపోటుతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున అయన గుండెపోటుతో బాత్ రూమ్ లోనే కుప్పకూలి మరణించారు. అయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడుని కోల్పోయిందని పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు అయనకి సంతాపం తెలుపుతున్నారు.

అందులో భాగంగానే ప్రధాని మోడీ జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు.. ప్రధాని మోడీ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.. "జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి" అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

జయప్రకాష్‌ రెడ్డి కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యారు. నరసింహనాయిడు, సమరసింహారెడ్డి, రెడీ, కబడ్డీ, కబడ్డీ మొదలగు చిత్రాలు అయనకి మంచి పేరును తీసుకువచ్చాయి. ఆయన చివరగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు..



Show Full Article
Print Article
Next Story
More Stories