Modi Respond On Mahesh Tweet : నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా మోడీకి రాజకీయ
Modi Respond On Mahesh Tweet : నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా మోడీకి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు.. అందులో భాగంగానే టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశాన్ని పంపారు.. అయితే దీనిపై ప్రధాని మోడీ వెంటనే రియాక్ట్ అయ్యారు..
''గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అసాధారణ నాయకత్వ లక్షణాలతో భారత దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా'' అని మహేష్ ట్వీట్ చేశారు.. ఈ ట్వీట్ పైన ప్రధాని మోడీ రియాక్ట్ అవుతూ.. ''దేశంలో వచ్చిన ఈ మార్పు భారతీయ పౌరుల సహకారం వల్లే సాధ్యమైంది. దేశ ప్రజలందరి సపోర్ట్, పార్టిసిపేషన్ ద్వారానే మనం ముందుకెళ్తున్నాం. వారికి సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం'' అని అన్నారు..అంతేకాకుండా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు మోడీ. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది..
The transformational changes in India have occurred due to the support and participation of my fellow Indians. Honoured to be serving them.
— Narendra Modi (@narendramodi) September 17, 2020
Thanks for the birthday wishes @urstrulyMahesh https://t.co/EMEwLRxeuC
ఇక ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారీ వారి పాట అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహష్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire