Pushpa 2: థియేటర్లన్నీ రద్దీగా ఉంటే ప్రేక్షకులు లేక వెలవెలబోయిన ప్రసాద్ మల్టీప్లెక్స్.. కారణం ఏంటంటే..?

Prasads Multiplex Goes Silent Amid No Pushpa 2 Shows
x

Pushpa 2: థియేటర్లన్నీ రద్దీగా ఉంటే ప్రేక్షకులు లేక వెలవెలబోయిన ప్రసాద్ మల్టీప్లెక్స్.. కారణం ఏంటంటే..?

Highlights

Mythri Vs Prasads: టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ సందడి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.

Mythri Vs Prasads: టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ సందడి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు మొత్తం బ్యానర్లతో నిండిపోయి ఉంటాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్, ప్రసాద్ మల్టీప్లెక్స్ లలో అయితే జనాలు కిక్కిరిసిపోతారు. ప్లెక్సీలు, బ్యానర్లతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. అయితే పుష్ప2 లాంటి పెద్ద సినిమా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో లేకపోవడం విశేషం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప2 ది రూల్ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప2 వచ్చింది. పుష్ప సినిమాతో బన్నీ వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. నేషనల్ అవార్డు అందుకున్నారు. పుష్ప2 డిసెంబర్ 4 నుంచి ప్రీమియర్ షోలు పడుతుండగా.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి అనేది చాలా మంది సినీ లవర్స్ కోరిక. ఎన్నో ఏళ్లుగా ప్రసాద్ లో సినిమాలు చూసే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రసాద్ PCX స్క్రీన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఈ స్క్రీన్ లో పుష్ప లాంటి సినిమా చూడాలి అని అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ పర్సంటేజ్ విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్స్, ఇటు ప్రసాద్ ఎక్కడ తగ్గడం లేదు. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఓపెన్ కాలేదు. ఈ నేపథ్యంలో మొట్టమొదటి సారి తెలుగు అగ్ర హీరో సినిమా విడుదల లేకపోవడంతో ప్రసాద్ మల్టీప్లెక్స్ మూగబోయినట్టు కనిపిస్తోంది. విడుదల ముందు రోజు నుంచే బ్యానర్లు, రివ్యూలతో సందడి చేసే ప్రసాద్ ఇప్పుడు సైలెంట్‌గా ఉంది.

ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యానికి, పుష్ప2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కి ఇంకా డీల్ కుదరలేదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రసాద్ నుంచి ఎక్కువ షేర్ మైత్రి అడిగినట్లు సమాచారం. ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ కి సంబంధించి 55 శాతం డిస్ట్రిబ్యూటర్‌కి ఇవ్వడానికి పీవీఆర్‌తో పాటు సినీపోలీస్, ఏషియన్ సినిమాలు అంగీకరించాయి. అయితే ప్రసాద్ నుంచి అదే కోరినట్టు సమాచారం. అయితే ప్రసాద్ యాజమాన్యం మాత్రం 52 శాతం షేర్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. మైత్రి మేకర్స్ 55 శాతం ఇవ్వాలని పట్టుబట్టడంతో ప్రసాద్ యాజమాన్యం అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ పర్సంటేజ్‌ని పెంచితే ప్రతి సినిమాకి ఇలానే ఇవ్వాల్సి ఉంటుందని ప్రసాద్ యాజమాన్య ఆలోచించినట్టు సమాచారం. ఎవరో ఒకరు తగ్గితే కానీ ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో పుష్ప2 సినిమా ప్లే అవుతుంది. చూడాలి మరి అసలు ఏం జరుగుతుందో.



Show Full Article
Print Article
Next Story
More Stories