Prakash Raj vs Pawan Kalyan: 'కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ...' పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ ట్వీట్ అటాక్
Prakash Raj vs Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ఎక్స్‌లో మరకో కామెంట్ పోస్ట్ చేశారు.
Prakash Raj vs Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ఎక్స్‌లో మరకో కామెంట్ పోస్ట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ.. కదా.. ఇక చాలు. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ ఆయన పోస్ట్ చేశారు.
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking
— Prakash Raj (@prakashraaj) October 1, 2024
తిరుపతి లడ్డూ వివాదంపై పవన్ టార్గెట్ గా ప్రకాశ్ రాజ్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అదే స్థాయిలో కౌంటరిచ్చారు.
తిరుపతి లడ్డూపై పవన్ వర్సెస్ ప్రకాశ్ రాజ్
తిరుపతి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం బాధించిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో నియమించిన టీటీడీ బోర్డు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ స్పందించారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే ఈ ఘటన జరిగింది... దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలి... దేశంలో ఇప్పటికే మన మతపరమైన గొడవలు చాలు.. దీన్ని మరీ పెద్దది చేయకండి అంటూ ప్రకాశ్ రాజ్ రియాక్టయ్యారు. తన ఎక్స్ పోస్టులకు ఆయన #JustAsking అని హ్యాష్ ట్యాగ్ తగిలించారు.
ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు. తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ అయిందని తెలిసి స్పందించకూడదా అని ఆయన ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడడం లేదన్నారు. సెక్యులరిజం వన్ వే కాదు, టూవే అ
ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కూడా స్పందించారు. తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను. లడ్డూ వివాదంపై మీరు మీడియా సమావేశాన్ని చూశాను. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయమై మాట్లాడతానని ఆయన చెప్పారు. తాను చేసిన ట్వీట్ ను మరోసారి చదువుకోవాలని ఆయన పవన్ కళ్యాణ్ కు సూచించారు.
కొనసాగుతున్న ట్వీట్లు
మనకేం కావాలి... ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయలబ్దిని సాధించడమా? లేక ప్రజల మనోభావాలను గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా జస్ట్ ఆస్కింగ్ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు కొనసాగింపుగా మరో ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోతో మరో మరో ట్వీట్ చేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అనే సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తన పోస్ట్‌లో కోట్ చేశారు.
దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿
— Prakash Raj (@prakashraaj) September 30, 2024
జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire