Prabhas-Anushka: బాబోయ్ అనుష్క కోసం ప్రభాస్ ఇంత త్యాగం చేస్తుండా?..టాలీవుడ్ నయా గాసిప్ నిజమేనా?

Prabhas-Anushka: బాబోయ్ అనుష్క కోసం ప్రభాస్ ఇంత త్యాగం చేస్తుండా?..టాలీవుడ్ నయా గాసిప్ నిజమేనా?
x
Highlights

Prabhas-Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో అనుష్కకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో...

Prabhas-Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో అనుష్కకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అనుష్క కేవలం సెలక్టివ్ సినిమాలు మాత్రమే చేస్తూ బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే మూవీలో నటిస్తోంది స్వీటి. దీనిలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ కోసం అనుష్క ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీని 2025 ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీలో అనుష్క విభిన్నమైన లుక్ లో కనిపించబోతుందట. ఈమధ్య రిలీజ్ అయిన గ్లింప్స్ లో అనుష్క లుక్స్ తోపాటు, ఆమె పాత్రను కూడా రివీల్ చేశారు. చాలా క్రూరంగా అనుష్క హత్య చేసిన షాట్స్ సినిమాపై భారీ అంచనాలనే పెంచాయి.

అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ అనే భారీ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు మారుతీ దర్శకుడు. ఇటు అనుష్క ఘాటీ అనే సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10కు లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షాకింగ్ గా ఈ సినిమాతో ఒక్కవారం గ్యాప్ లోనే అనుష్క కూడా ఘాటీతో తన ధాటి చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మూవీ మేకర్స్ చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వారం రోజుల గ్యాప్ లో క్లాష్ ఉంటుందని టాక్. కానీ తాజా గాసిప్ ఏంటంటే అనుష్క కోసం ప్రభాస్ త్యాగం చేయబోతున్నట్లు ఫిలింనగర్ లో జోరుగా వినిపిస్తోంది.

అనుష్క సినిమా వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ తన రాజాసాబ్ మూవీని వాయిదా వేసుకోనున్నారట. అంతేకాదు అనుష్క సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ కు సన్నిహితులే. దీంతో ఆయన రాజసాబ్ ను వాయిదా వేసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది త్వరలోనే తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories