Kalki 2898 AD Movie Review: కల్కి 2898 ఏడీ సినిమా ఎలా ఉంది.? అసలు నాగ్ అశ్విన్‌ ఏం చెప్పాలనుకున్నాడు.?

Kalki 2898 AD Movie Review: కల్కి 2898 ఏడీ సినిమా ఎలా ఉంది.? అసలు నాగ్ అశ్విన్‌ ఏం చెప్పాలనుకున్నాడు.?
x

Kalki 2898 AD Movie Review: కల్కి 2898 ఏడీ సినిమా ఎలా ఉంది.? అసలు నాగ్ అశ్విన్‌ ఏం చెప్పాలనుకున్నాడు.?

Highlights

Kalki 2898 AD Telugu Movie Review: ఒక్క ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది.

చిత్రం: కల్కి 2898 ఏడీ

నటీనటులు: ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శోభన, స్వాస్థ ఛటర్జీ, పశుపతి, కీర్తి సురేశ్‌ (వాయిస్‌ఓవర్‌), విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ తదితరులు

సంగీతం: సంతోష్‌ నారాయణన్‌

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరావు

సినిమాటోగ్రఫీ: జోర్డే స్టోవిల్కోవిచ్

సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా

నిర్మాత: సి.అశ్వనీదత్

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగ్‌ అశ్విన్

విడుదల తేదీ: 27-06-2024

Kalki 2898 AD Telugu Movie Review: ఒక్క ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. కల్కి సినిమాలో థియేటర్లలో సందడి చేస్తోంది. నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా దాదాపు 4 ఏళ్లపాటు నిర్మాణం జరుపుకున్న కల్కి సినిమా అత్యంత భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. విడుదలకు ముందే రికార్డులను తిరగరాసిన కల్కి సినిమా ఎలా ఉంది.? అసలు దర్శకుడు నాగ అశ్విన్‌ ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడు. రివ్యూలో చూద్దాం.

కల్కి చిత్రాన్ని నాగ అశ్విన్‌ పురాణాలను, ఆధునిక ప్రపంచాన్ని జోడించి తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచే అర్థమైంది. ముఖ్యంగా టైమ్‌ ట్రావెలింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది ముందు నుంచే హింట్‌ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగానే కల్కి 2898 ఏడీ మూవీని టైమ్‌ ట్రావెలింగ్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్‌ కథాంశంగా తెరకెక్కించారు. పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో ఈ సినిమాను నాగ అశ్విన్‌ అద్భుతంగా తీశారు.


ఇంతకీ కథేంటీ?

కల్కి కథ ముఖ్యంగా మూడు నగరాల మధ్య జరగుతుంది. ఇందులో 'కాంప్లెక్స్'.. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి.. ఇక్కడే సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు. ఇక భూ ప్రపంచమంతా వనరులను కోల్పోయి, నిర్జీవమైన దశలో 'కాశీ' పట్టణాన్ని చూపించారు. ఇక మరో ప్రధానమైన నగరం 'శంబల'. ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఓ మహా యోధుడు (కల్కి) వస్తాడని వీళ్లంతా నమ్ముతూ ఉంటారు. మరోవైపు కల్కి రాక కోసం అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) వేల ఏళ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉంటాడు.

ఈ క్రమంలోనే అన్నీ రకాల వనరులు అందుబాటులో ఉన్న కాంప్లెక్స్‌లోకి వెళ్లి పోవాలని భైరవ (ప్రభాస్‌) ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయితే ఇదే సమయంలో సుమతి (దీపిక పదుకొణె) కడుపులో కల్కి పుట్టబోతున్న విషయాన్ని యాస్కిన్‌ తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సుమతిని తన దగ్గరికి తీసుకురావాలని సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఇదే సమయంలో సుమతికి రక్షణ అశ్వత్థామ ఉంటాడు. అయితే సుమతిని తమకు అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తామని భైరవకు ఆఫర్‌ ఇస్తారు. దీంతో ఎలాగైనా సుమితిని యాస్కిన్‌కు అప్పగించాలని భైరవ అనుకుంటాడు. ఈ క్రమంలోనే అశ్వత్థామకు, భైరవకు మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇంతకీ యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తారు.? అసలు భైరవ ఎవరు.? కల్కి ఎవరు.? ఇలాంటి విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


సినిమా ఎలా ఉంది?

కల్కి హిందీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అమితాబ్‌ మాట్లాడుతూ.. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా కథను ఏం తాగి రాశాడో అర్థం కాలేదు ఓ కామెంట్ చేశారు. కల్కి మూవీ చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. దర్శకుడు భవిష్యత్తును ఊహించి తీరు అద్భుతంగా ఉంది. వేల ఏళ్ల తర్వాత కాశీ నగరం ఎలా ఉండబోతోంది, అప్పుడు మనుషులు ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారు.? యుద్ధాలు ఎలా జరుగుతాయి.? లాంటి అంశాలు ఊహకు అందని విధంగా ఉన్నాయి. మొత్తం మీద కల్కిని విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారు. ప్రభాస్‌ నటన అద్భుతంగా ఉంది. అమితాబ్‌ తన నటనతో మెస్మరైజ్‌ చేశారు. కమల్‌హాసన్‌ పాత్ర కాసేపు ఉన్నా బాగుంది. ఇక దీపికా కూడా తన పాత్రకు ప్రాణం పోసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దిశా ప‌టానీ పాత్ర అలా మెరిసి, ఇలా మాయ‌మైపోతుంది. శోభ‌న, అన్నాబెన్‌, ప‌శుప‌తి, మాన‌స్ పాత్ర‌లో స్వాస్థ్‌ ఛటర్జీ త‌దిత‌రులు పోషించిన పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా ప్ర‌భావం చూపించారు. బ్ర‌హ్మానందం, ప్ర‌భాస్‌తో క‌లిసి కొన్ని న‌వ్వులు పంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories