Prabhas: మోస్ట్ పాపులర్ హీరోగా యంగ్ రెబల్ స్టార్..రామ్ చరణ్,అల్లు అర్జున్ జాబితాలో ఉన్నారా?
Prabhasప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ హీరోల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. మరి రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఈ జాబితాలో ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం.
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...ప్రస్తతం కల్కీ మూవీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఘనత సాధించారు డార్లింగ్. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ హీరోల లిస్టులో అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా ఆర్మాక్స్ జూన్ నెలకు సంబంధించిన దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్ల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. మే నెలలో టాప్ వన్ లో ఉన్న ప్రభాస్..జూన్ లోనూ అదే స్థానంలో కొనసాగారు. కాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఇక అల్లు అర్జున్, ఎన్టీఆర్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలవగా..గేమ్ ఛేంజర్ తో రానున్న రామ్ చరణ్ మాత్రం ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. మోస్ట్ పాపులర్ హీరోయిన్ ల జాబితాలో అలియా భట్ మొదటి స్థానంలో నిలిచారు. సమంత, దీపిక పదుకొణె తర్వాత స్థానంలో ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి 3 స్థానంలో, 6వ స్థానంలో మహేశ్ బాబు ఉన్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ 7, 8, 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
Ormax Stars India Loves: Most popular female film stars in India (Apr 2024) #OrmaxSIL pic.twitter.com/DyIC74lQVB
— Ormax Media (@OrmaxMedia) May 22, 2024
ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. బుక్ మై షోలో షారుక్ ఖాన్ జవాన్ రికార్డును బ్రేక్ చేసింది. 12.15 మిలియన్లకు పైగా ఈ మూవీ టికెట్లు అమ్ముడైనట్లు ఆ సంస్థ తెలిపింది. విదేశాల్లోనూ ఇంకా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయని నిర్మాణ సంస్థ తెలిపింది. కాగా Ormax మీడియా అత్యంత జనాదరణ పొందిన తారల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire