Prabhas Birthday Special: రెబల్‌ స్టార్‌ క్రేజ్‌కు ఇదే నిదర్శనం.. ప్రభాస్‌ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌

Prabhas Birthday Special
x

Prabhas Birthday Special

Highlights

Prabhas Birthday Special: ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా 6 సినిమాలు విడుదలకానున్నాయి. మిస్టర్ పర్‌ఫెక్ట్‌, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్‌, రెబల్‌తో పాటు సలార్‌ చిత్రాలు విడుదల కానున్నాయి.

Prabhas Birthday Special: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్‌ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజుల సందర్భంగా పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఇక రీరిలీజ్‌ కలెక్షన్ల పరంగా కూడా కొన్ని చిత్రాలు సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. అయితే సహజంగా హీరోకు సంబంధించి ఒక్క సినిమా మాత్రమే రీరిలీజ్ చేస్తుంటారు. అయితే యంగ్ రెబల్ స్టార్‌ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టబోతున్నారు.

బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా నేషనల్‌, ఆ మాటకొస్తే ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగారు ప్రభాస్‌. తాజాగా సలార్‌, కల్కి చిత్రాలతో తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ప్రభాస్‌ (Prabhas) నుంచి సినిమా వస్తుందంటే చాలు రూ. వెయ్యి కోట్లు కాన్ఫామ్‌ అనేంతలా పరిస్థితి మారిపోయింది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 23వ తేదీన ప్రభాస్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని పాత సినిమాలను రీరిలీజ్‌ చేస్తున్నారు. అయితే ఇందులోకూడా రెబల్‌ స్టార్‌ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.



ప్రభాస్‌ పుట్టిన రోజు (Prabhas Birthday) సందర్భంగా ఏకంగా 6 సినిమాలు విడుదలకానున్నాయి. మిస్టర్ పర్‌ఫెక్ట్‌, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్‌, రెబల్‌తో పాటు సలార్‌ చిత్రాలు విడుదల కానున్నాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జపాన్‌లో కూడా కొన్ని సినిమాలు విడుదలవుతుండడం విశేషం. ఇక సలార్‌ మూవీ ఇతర రాష్ట్రాల్లో కూడా రీరిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో ఇది వరకు ఎప్పడూ లేని కొత్త ట్రెండ్‌కు ప్రభాస్‌ శ్రీకారం చుట్టారు. ఒకే రోజు ఏకంగా 6 చిత్రాలు రీరిలీజ్‌ అవుతుండడంతో ప్రభాస్‌ కలెక్షన్ల పరంగా కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




ఇదిలా ఉంటే రీరిలీజ్‌లతో పాటు ప్రభాస్‌ పుట్టిన రోజు (Prabhas Birthday) సందర్భంగా ఫ్యాన్స్‌కు మరికొన్ని సర్‌ప్రైజ్‌లు ఉండనున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజా సాబ్‌ మూవీ టీజర్‌ను అక్టోబర్‌ 23వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే స్పిరిట్‌, ఫౌజీ మూవీలకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మేకర్స్‌ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం.




Show Full Article
Print Article
Next Story
More Stories