Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.
Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తొలి రోజు నుంచే రికార్డ్ కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాను రాజకీయాలతో మూడిపెడుతూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగ్‌లు పెట్టడంతో 'వకీల్ సాబ్'పై నెగిటివ్ ప్రచారం ఎక్కువైంది.
మరోవైపు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందనలు రాకపోవడంతో ఈ అంశం కోర్టులకెక్కింది. దీంతో పవన్ ఫ్యాన్స్, జగన్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. ఈ నేపథ్యలో వకీల్ సాబ్ చిత్రంపై సినీనటీ పూనం కౌర్ సంచలన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ డిఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి అంతేతప్ప.. ఈ కుళ్లు రాజకీయాలు ఎందుకు? ఎవరు చేస్తున్నట్టు?? అమ్మాయిలను డిఫేమ్ చేసి రాజకీయాలు చేస్తే తప్పు కాదు.. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లెమ్ ఎవరికి..? అంటూ ట్వీట్ చేసింది.
"సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన వివాహం లాంటిది', ఇది కేవలం కొంత మంది వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చాలి. కని కాపురం చేయకపోతే ఫీల్ అయ్యేది ప్రజలు' అంటూ పూనమ్ సంచలన ట్వీట్ చేశారు. జనసేన ఫ్యాన్స్ పూనమ్ ట్వీట్స్ పై పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు వకీల్ సాబ్ మూవీ టికెట్ల ధరలపై రచ్చ మరింత ముదురుతోంది. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా పెంపుకు సిద్దమైన థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు జగన్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. టికెట్లు పెంచితే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన బయ్యర్లు మూడు రోజుల పాటు పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే దీనిపైన కూడా ఆగ్రహంగా ఉన్న జగన్ సర్కార్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
Manchi content unna cinema ki evarina chesina encourage cheyali kani ee. Defaming organised trends ento?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 9, 2021
Ippudu evar chestunaru kullu rajikiyalu?
Ammailu ni defame chesi rajikiyam cheste tappu kadu
Ammail ni rakshinchey cinema teestey problem evariki?
Pressmeet PosaniGaru ?
The very organised relationship of arranged marraige between cinema and politics to benefit people and not the concerned individuals. Neither can they live with each other or vice versa .....Kani kapooram cheyakapotey ...feel aiyedi chustu unna Janalu .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) April 9, 2021
Kullu rajikiyalu maneyali
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire