Poonam Kaur: ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవు.. సినీ పెద్దల, సీఎం మీట్ పై పూనమ్ కౌర్ సెటైర్..

Poonam Kaur Satires on Film Industry and CM Meeting
x

Poonam Kaur: ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవు.. సినీ పెద్దల, సీఎం మీట్ పై పూనమ్ కౌర్ సెటైర్..

Highlights

Poonam Kaur: సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.

Poonam Kaur: సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీపై హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన వారిలో ఇండస్ట్రీ నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరికీ సమస్య ఉండదంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపైనే కాకుండా సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు పూనమ్ కౌర్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌తో వార్తల్లో నిలుస్తున్నారు.

ఇక సంధ్య థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులు.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, త్రివిక్రమ్, వెంకటేష్, రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ తరపున ఏ ఒక్క మహిళ డైరెక్టర్ కానీ, నటి కానీ పాల్గొనలేదు. దీన్ని ఉద్దేశించి నటి పూనమ్ కౌర్ ట్వీట్టర్ వేదికగా చురకలంటించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories