Poonam Kaur Satire: తగ్గేదేలే అంటోన్న పూనమ్.. అదే రాజకీయం..ఇదే నాయకత్వమంటూ చురకలు.. ఇంకా ఏం అన్నారంటే!

Poonam Kaur Satire: తగ్గేదేలే అంటోన్న పూనమ్.. అదే రాజకీయం..ఇదే నాయకత్వమంటూ చురకలు.. ఇంకా ఏం అన్నారంటే!
x
Highlights

Poonam Kaur Satire: సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ మీద నటి పూనమ్ కౌర్ ఛాన్స్ దొరికితే చాలు కౌంటర్ల మీద కౌంటర్ల వేస్తూనే ఉంది. అల్లు అర్జున్ కు...

Poonam Kaur Satire: సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ మీద నటి పూనమ్ కౌర్ ఛాన్స్ దొరికితే చాలు కౌంటర్ల మీద కౌంటర్ల వేస్తూనే ఉంది. అల్లు అర్జున్ కు సపోర్టుగా పూనమ్ వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా మరో సెటైర్ వేసింది. రాజకీయం అంటేనే ఇది..తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడమంటూ కామెంట్స్ చేసింది. ఇక అల్లు అర్జున్ అరెస్టు మీద కూడా సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడం..నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం..హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం..రాత్రంతా అల్లు అర్జున్ జైల్లో ఉండటం ఇదంత జరిగిపోయింది. శనివారం ఉదయం బన్నీ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ లోపు సోషల్ మీడియాలో యుద్ధమే జరిగింది. బన్నీని అన్యాయంగా అరెస్టు చేస్తారా అంటూ తొక్కిసలాటలో మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అల్లు అర్జున్ ను అరెస్టు చేశారంటే..ఎంతో మంది రాజకీయ నాయకులను కూడా అరెస్టు చేయాలంటూ అంతా నిలదీస్తూ వచ్చారు.


ఇక సెలబ్రిటీలు బన్నీకి సపోర్టుగా నిలిచారు. టాలీవుడ్, బాలీవుడ్ సైతం అండగా నిలిచింది. పలువురు స్టార్లు ఆయనకు మద్దతు పలికారు. అటు రేవంత్ రెడ్డి కక్ష్య సాధింపు చర్య అంటూ ప్రతిపక్షాలు మండిపడ్దాయి. ఇదే అదునుగా పూనమ్ కౌర్ కూడా కొన్ని సెటైర్లు వేసాశారు. అల్లు అర్జున్ ఫొటోలను షేర్ చేస్తూ..నా ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో ట్వీట్ చేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేయడమే రాజకీయం..ఆ అధికారాన్ని ప్రజల డెవలప్ మెంట్ కి వాడటమే నాయకత్వం అంటూ కౌంటర్ వేసింది. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు తమ పవర్ ను మిస్ యూజ్ చేస్తున్నారని..రాజకీయాలు చేస్తున్నారని పూనమ్ కౌర్ కౌంటర్ వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories