Pooja Hegde: ఆ విషయంలో వెనక్కి తగ్గిన పూజా.. కారణం అదేనా.?
Pooja Hegde Remuneration: తాజాగా పూజా హెగ్డే రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Pooja Hegde Remuneration: ఒక లైలా కోసం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. బడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ చిన్నది. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ రాణించిన ఈ చిన్నది అలా వైకుంఠపురం చిత్రం తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి వరుస పరాజయాల తర్వాత పూజాకు ఆశించిన స్థాయిలో విజయాలను వరించలేవని చెప్పాలి. దీంతో ప్రస్తుతం మళ్లీ కమ్ బ్యాక్ కోసం తీవ్రంగా కృషి చేస్తోందీ చిన్నది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఒక్క సినిమా కూడా చేతిలో లేకపోవడం గమనార్హం. తమిళంలో రెండు చిత్రాలు హిందీలో ఒక సినిమాలో నటిస్తోంది. వీటిలో తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పడం ఖాయమని పూజా భావిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా పూజా రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న ఈ చిన్నది తాజాగా రెమ్యునరేషన్‌ను తగ్గించినట్లు తెలుస్తోంది. అవకాశాలు తగ్గడంతోనే పూజా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ సినిమాకు పూజా రెమ్యునరేషన్ తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తమిళంలో సూర్య 44 చిత్రంలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసిందీ బ్యూటీ. ఈ సినిమా కూడా తనకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావంతో ఉంది. మరి పూజా తీసుకున్నా నిర్ణయం తన కెరీర్‌కు ఏమేర ఉపయోగపడుతుంది. మళ్లీ అవకాశాలు క్యూ కడతాయా అన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire