సోషల్ మీడియాలో మొదలైన తెలుగు వర్సెస్ తమిళ్ వార్

Ponniyin Selvan 1 War Between Telugu Audience and Tamil Audiences
x

సోషల్ మీడియాలో మొదలైన తెలుగు వర్సెస్ తమిళ్ వార్

Highlights

*సోషల్ మీడియాలో మొదలైన తెలుగు వర్సెస్ తమిళ్ వార్

Ponniyin Selvan 1 War: భారీ అంచనాల మధ్య ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన "పోన్నియిన్ సెల్వన్" సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. విడుదల కి ముందు నుంచే ఈ సినిమా తమిళ్ "బాహుబలి" అవుతుంది అని అభిమానులు చెప్పుకు వస్తున్నారు. తమిళ్ చిత్ర పరిశ్రమకు ఈ సినిమా గౌరవం తెచ్చిపెడుతుంది అని అభిమానులు ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు.

కానీ విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంటుంది. తమిళ్ తో పాటు సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో విడుదలైన ఈ సినిమా ఒక్క భాషలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది.ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులు రాజమౌళిని పొగడటం మొదలుపెట్టారు. ఇలాంటి సినిమాలు తీయడం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యమని సోషల్ మీడియా ద్వారా పొగడటం స్టార్ట్ చేశారు.

అయితే తమిళ్ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులపై మండిపడుతున్నారు. ఇలా వీరిద్దరి మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ అయింది. రాజమౌళి తీసిన బాహుబలి కేవలం ఒక ఫిక్షనల్ స్టోరీ అని కానీ "పోన్నియిన్ సెల్వన్" నిజంగానే యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని విరుచుకుపడుతున్నారు. ఇలా ఒకరిపై ఒకరు తెలుగు మరియు తమిళ్ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తెగ ట్రోల్స్ మరియు మీమ్స్ మొదలుపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories