Ponnambalam: సొంత తమ్ముడే స్లో పాయిజన్ ఇచ్చాడు.. చిరంజీవి నా వైద్యం కోసం రూ. 40 లక్షలు ఇచ్చారు..

Ponnambalam Says Chiranjeevi Gave him Rupees 40 Lakhs For his Treatment
x

Ponnambalam: సొంత తమ్ముడే స్లో పాయిజన్ ఇచ్చాడు.. చిరంజీవి నా వైద్యం కోసం రూ. 40 లక్షలు ఇచ్చారు..

Highlights

Ponnambalam: ప్రముఖ నటుడు పొన్నంబలం ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా గుర్తింపు పొందాడు.

Ponnambalam: ప్రముఖ నటుడు పొన్నంబలం ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా గుర్తింపు పొందాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన సౌత్‌ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. కాగా ఈ నటుడు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. చికిత్స చేయించుకోడానికి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకొనే ఆలోచన కూడా చేసినట్లు గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కిడ్నీ సంబంధిత సమస్య నుంచి ఇటీవలే కోలుకున్న ఆయన తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఆరోగ్యం, చిరంజీవి చేసిన సాయం సహా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తన తండ్రికి నలుగురు భార్యలని.. మూడో భార్య కొడుకు తన దగ్గర కొంత కాలం మేనేజర్‌గా పనిచేశాడని తెలిపారు. మేనేజర్‌గా పనిచేసిన తన తమ్ముడే ఒకసారి తనకు బీరులో స్లో పాయిజన్ ఇచ్చాడన్నారు. అయితే అతను అలా చేశాడని మొదట తనకు తెలియదన్నారు. ఆ తర్వాతే ఈ దారుణమైన పని చేశాడని తనకు తెలిసిందన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని.. కోలుకుంటున్నానని తెలిపారు.

గతంలో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి రూ.40 లక్షల ఆర్థిక సాయం చేసి తన పాలిట దేవుడయ్యారని ఎమోషనల్‌ అయ్యారు పొన్నంబలం‌. రెండేళ్ల క్రితం పొన్నంబలం కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీల సాయం కోరారు పొన్నంబలం. ఆయనకి సాయం చేయడానికి తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి చాలా మంది ముందుకొచ్చారు. అలా సాయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు.

తన స్నేహితుడి ద్వారా చిరంజీవి ఫోన్ నంబర్ సంపాదించిన పొన్నంబలం.. ఆయనకు ఒక మెసేజ్ చేశారట. 'అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి' అని మెసేజ్ పెట్టారట. మెసేజ్ చేసిన పది నిమిషాల తర్వాత పొన్నంబలానికి చిరంజీవి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని పొన్నంబలం స్వయంగా వెల్లడించారు. ''హాయ్ పొన్నంబలం.. ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగాలేదా.. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా.. నేను ఉన్నాను, కంగారుపడకు.. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అని చిరంజీవి నన్ను అడిగారు. నేను రాలేను అన్నయ్య అని చెప్పాను. అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు. అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు. రామ్ చరణ్ సార్ భార్యదే అపోలో హాస్పిటల్. ఆమె ద్వారానే నాకు వైద్యం అందింది'' అని పొన్నంబలం భావోద్వేగానికి గురయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories