Allu Arjun Stampede Case: అల్లు అర్జున్ ను అడిగే ప్రశ్నలివే..!

Police Questions All Arjun in Stampede Case
x

Allu Arjun Stampede Case: అల్లు అర్జున్ ను అడిగే ప్రశ్నలివే..!

Highlights

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

అల్లు అర్జున్ (Allu Arjun)ను సంధ్య థియేటర్ కు వచ్చే సమయంలో రోడ్ షోకు ఎవరి అనుమతి తీసుకున్నారని పోలీసులు ప్రశ్నించారు. మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు అల్లు అర్జున్ వచ్చారు. చిక్కడపల్లి ఏసీపీ రమేష్, డీసీపీ, సీఐ, ఎస్ఐ ఆయనను ప్రశ్నించారు. అల్లు అర్జున్ ను తన న్యాయవాది ఆశోక్ రెడ్డి (Ashok Reddy) సమక్షంలో విచారించారు. అల్లు అర్జున్ ను సుమారు 50నుంచి 60 ప్రశ్నలు వేశారు.

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రోడ్ షో కు అనుమతి తీసుకున్నారా..అనుమతి లేకున్నా రోడ్ షో ఎందుకు నిర్వహించారనే విషయాలపై పోలీసులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. సినిమా యూనిట్ ను థియేటర్ వద్దకు రావొద్దని పోలీసులు సూచించారు. దీనిపై సంధ్య థియేటర్ యజమానికి సమాచారం ఇచ్చారు. కానీ, అనుమతి లేకున్నా ఎలా వచ్చారని కూడా పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ థియేటర్ లో ఉన్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే థియేటర్ లో ఉన్న సమయంలో తనకు ఈ విషయం తెలియదని అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం ఈ విషయమై సమాచారం ఇచ్చామని చెప్పారు. దీనిపై కూడా ఆయనన ప్రశ్నించనున్నారు. ఎవరెవరు మీ కుటుంబ సభ్యులు థియేటర్ కు వచ్చారు, ఎందరు బౌన్సర్లు అల్లు అర్జున్ వెంట వచ్చారనే విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నారు.

అల్లు అర్జున్ సమాధానాలపై విచారణ అధికారి సంతృప్తి చెందకపోతే పోలీసులు సీన్ ను రీ కన్ స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట సమయంలో పరిస్థితులను సీన్ రీకన్ స్ట్రక్షన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories