Pushpa 2: సంధ్య థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు

Pushpa 2: సంధ్య థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు
x
Highlights

Pushpa 2: పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని సంథ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Pushpa 2: పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని సంథ్య థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. థియేటర్ కు పరిమితికి మించి అభిమానులు వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. సంథ్య థియేటర్ యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

Also Read: Pushpa 2 Review: ఏముంది ఇందులో?

సంథ్య థియేటర్ కెపాసిటీ 1200. అయితే బెనిఫిట్ షో సందర్భంగా సంథ్య థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్నారనే ప్రచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఈ థియేటర్ వద్దకు చేరుకున్నారు. అల్లు అర్జున్ రాగానే అభిమానులు ఒక్కసారిగా ఆయనను చూసేందుకు పరుగులు తీశారు. ఈ సమయంలో పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీచార్జీ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories