Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాని మోడీ!

PM Modi to pay Last Respects to Legendary Singer Lata Mangeshkar
x

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ అంత్యక్రియలకు ప్రధాని మోడీ!

Highlights

Lata Mangeshkar Death: మెలోడి క్వీన్ లతా మంగేష్కర్ తనువు చాలించడంపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనయ్యారు.

Lata Mangeshkar Death: మెలోడి క్వీన్ లతా మంగేష్కర్ తనువు చాలించడంపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. లతా మంగేష్కర్ ను అభినందించిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ... గానకోకిలగా ప్రపంచవ్యాప్త శ్రోతల హృదయాలను రంజింపజేశారని పేర్కొన్నారు. అన్ని వయస్కుల శ్రోతలను గాయనిగా ఆకట్టుకుని , భావోద్వేగాలను పలికించడంలో ఆమెకు ఆమే సాటిగా నిలిచారన్నారు. భౌతికంగా లతా మంగేష్కర్ మన మధ్య లలేకపోయినా... ఆమె పాడిన పాటలు చిరకాలం సజీవంగా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

దశాబ్ధాలుగా గానాలాపనతో నేపథ్యగాయనిగా సముచిస్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. ఎదురైన సవాళ్లను అధిగమించి... చిరుప్రాయంలోనే తండ్రిని పోగొట్టుకున్న లతామంగేష్కర్ ఎదుగుదల... ఎంత ఎదిగినా.. ఒదిగి ఉంటే తత్త్వం బావితరాలకు ఆదర్శప్రాయమన్నారు. లతామంగేష్కర్ తో పలు సందర్భాల్లో స్వయంగా పరస్పరం చర్చించుకున్న విషయాలు తీపిగుర్తుగా మిగిలాయని ఆయన గుర్తుచేసుకున్నారు. లతా మంగేష్కర్ మరణం జీర్ణించుకోలేనిదని నరేంద్రమోడీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

కాగా ప్రజలు ఆమెకు నివాళులు అర్పించేందుకు వీలుగా నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలవరకు ఆమె పార్థివ దేహాన్ని తన నివాసంలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. లతా మంగేష్కర్ పార్దివ దేహానికి నివాళులర్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైకి వెళ్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు ఆయన ముంబై చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఆమె పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories