Plasma Treatment For SP Balu : ఎస్పీ బాలుకి ప్లాస్మా ట్రీట్‌మెంట్

Plasma Treatment For SP Balu : ఎస్పీ బాలుకి ప్లాస్మా ట్రీట్‌మెంట్
x
Sp Balu (File Photo)
Highlights

Plasma Treatment For SP Balu : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన

Plasma Treatment For SP Balu : దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ పైన ఎక్కువగా ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.. అందులో భాగంగానే ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరినప్పుడు అయన ఆరోగ్యం నిలకడగానే ఉన్న గత గురువారం రాత్రి మాత్రం ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.. వయసు పైబడిన వారు కరోనా నుంచి కోలుకోవడం అనేది ఇప్పుడు కాస్త సవాల్ గా మారింది.

అయితే ఎస్పీబీ ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు వెంటిలేటర్ పై ఆయనను ఉంచి చికిత్స అందిస్తున్నారు.. రెండు రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ మీద ఉంటూ వైద్యం తీసుకుంటున్నారు. అయితే అయనకి ప్లాస్మా చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయానికి వచ్చారు. ఇటీవల ప్లాస్మా నుంచి చాలా మంది ప్రముఖులు కోలుకున్న సంగతి తెలిసిందే..

తాజాగా తమిళనాడు మంత్రి విజయ భాస్కర్‌ ఆసుపత్రికి వెళ్లి బాలును పరామర్శించారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా ఎస్పీ బాలుకు అయ్యే వైద్య ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు.. ఇక బాలుకు ప్లాస్మా చికిత్స కూడా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇక బాలు ఆరోగ్యం మెరుగు పడేందుకు గాను మరో రెండు రోజుల పాటు అయనని వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories