Vakeel Saab in OTT: నో డౌట్ 'వకీల్ సాబ్' ఓటీటీలో వచ్చేది ఆ రోజే

Pawan Kalyan Vakeel Saab Movie Release Date in OTT is 07 05 2021
x

వకీల్ సాబ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Vakeel Saab in OTT: 30th April నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

Vakeel Saab in OTT: పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ మూవీ ఏప్రీల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. కరోనా సమయంలో కూడా అదిరిపోయే కలెక్షన్స్‌ వచ్చాయి. పవర్ స్టార్ సినిమాకు మొదటి వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ తర్వాత తగ్గిపోయాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆల్రెడీ థియేటర్స్ మూతపడ్డాయి.

కొన్ని సినిమాలు ఓటిటిలోకి కూడా వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ కూడా ఓటీటీ బాట పట్టనుందని తెలుస్తోంది. ఎప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటికే పలుమార్లు వకీల్ సాబ్ ఓటీటీ విడుదలపై వార్తలు వచ్చాయి. నిర్మాత దిల్ రాజు ‌ఖండిస్తూవస్తున్నారు.

ఈ సారి మాత్రం అంటే ఎప్రిల్ 30న అన్నమాట. తాజాగా ఇదే విషయాన్ని ఖరారు చేస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసారు అమెజాన్ ప్రైమ్ వీడియో.. అనన్య నాగల్ల, నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ ఓ చిన్న పాత్రలో మెరిసింది. థమన్ సంగీతం అందించగా మరో కీలకపాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు.

దిల్ రాజు ఈ సినిమాను 150 కోట్ల రూపాయలకు అంటే థియేట్రికల్, శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను అమ్మినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ ప్రోడ్యూసర్‌కు హీరోకు మంచి లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు హరిహర వీరమల్లు టైటిల్ ప్రకటించారు. వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఏ ఎం రత్నం నిర్మించనుండగా ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే పవన్ కళ్యాణ‌్ కు కరోనా సోకింది. పూర్తిగా పవన్ కరోనా నుంచి కోలుకోలేదు. పవన్ కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమా పట్టాలెక్కనుంది.




Show Full Article
Print Article
Next Story
More Stories