Google Search: ఇంటర్నేషనల్ లెవల్లో పవన్ హవా..గూగుల్ సెర్చ్ లో రెండో స్థానంలో నిలిచిన పవన్ కల్యాణ్

Google Search: ఇంటర్నేషనల్ లెవల్లో పవన్ హవా..గూగుల్ సెర్చ్ లో రెండో స్థానంలో నిలిచిన పవన్ కల్యాణ్
x
Highlights

Google Search: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. ఈ ఏడాది ఒక సినిమాలో కూడా నటించకపోయినా ఆయన పేరు...

Google Search: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. ఈ ఏడాది ఒక సినిమాలో కూడా నటించకపోయినా ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. తన స్టామినా ఏంటో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా చూపించారు. ఎలాంటి పాన్ ఇండియా మూవీ లేకుండా నార్త్ ఆడియెన్స్ లో పవన్ కల్యాణ్ కు భారీ క్రేజ్ దక్కింది. దీంతో పవన్ క్రేజ్ లోకల్ నుంచి నేషనల్ వరకు వెళ్లింది. దీంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సారి పవన్ క్యాలన్ జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ట్రెండింగ్ లో ఉన్నారు.

సోషల్ మీడియాకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా అంటే తెలియనివారుండరు. జీవితంలో ఒక భాగంగా మారింది సోషల్ మీడియా. సినిమాలు, బిజినెస్ లు, హెల్త్, ఇతర వార్తలు ఎన్నో రకాల వార్తల ను చూసేందుకు టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్ల కంటే సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనం నిత్యం సోషల్ మీడియాలో ఎవరి కోసం సెర్చ్ చేస్తుంటాం..ఆ సమయంలో ట్రెండింగ్ ఉన్న వారి కోసం ఇండియా అంతటా నెటిజన్లు సెర్చ్ చేస్తుంటారు. ఇలా గూగుల్ ఈ ఏడాదిలో అత్యధికంగా మంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి సెర్చ్ చేసినట్లు తెలిపింది.

పవన్ రాజకీయ ప్రయాణం, మంత్రిత్వశాఖ పేరు గురించి చాలా మంది గూగుల్లో సెర్చ్చేశారు. ముఖ్యమైన ప్రశ్నలలో పవన్ కల్యాణ్ పోర్ట్ పోలియో, ఏపీలో పవన్ కల్యాణ్ మంత్రిత్వ శాఖ, పిఠాపురం, పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాలు ఇలా సెర్చ్ లో టాప్ ప్లేసులో ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సీజ్ ద షిప్ అంటూ దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. దీంతో పవన్ కల్యాణ్ ఎవరు..ఆయన హిస్టరీ తెలుసుకునేందుకు దేశం నలుమూలల నుంచి పవన్ కల్యాణ్ కీ వర్డ్ తో సెర్చ్ చేశారు.

గూగుల్లో గ్లోబల్ లెవల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ సినీ నటుల లిస్టులో పవన్ కల్యాణ్ ఏకంగా వరల్డ్ వైడ్ గా 2 ప్లేసులో నిలిచాడు. దీంతో పవన్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చెప్పుకోవాలని అభిమానులు సంబురపడుతున్నారు. ఇక హీరోలు, రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కల్యాణ్ మొదటిస్థానంలో, చిరాగ్ పాశ్వాన్ రెండో స్థానంలో, ప్రధాని మోదీ మూడోస్థానంలో, చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories